– కూడళ్ళ ఆధునీకరణకు స్థల పరిశీలన చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని (టౌన్), అక్టోబర్ 4ః పట్టణ సుందరీకరణలో భాగంగా గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలను ఆధునీకరిస్తూ, అభివృద్ధి పరుస్తూ, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
మంగళవారం ఖనిలోని రాజేష్ థియేటర్ చౌరస్తా, ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా కూడళ్ళ సుందరీకరణ నిర్మాణం కోసం ఎమ్మల్యే కోరుకంటి చందర్, మేయర్ బంగి అనిల్కుమార్ లు స్థల పరిశీల చేసారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిఖని ప్రధాన చౌరస్తా సుందరీకరణ పూర్తికావచ్చిందని, కోటి రూపాయల నిధులతో రాజేష్ ధియేటర్ చౌరస్తా, ఫైవింక్లైన్ చౌరస్తాలను ఆధునీకరిస్తున్నామన్నారు. త్వరిత గతిన పనులు పూర్తి చేస్తామన్నారు.
అనంతరం తిలక్ నగర్, రమేష్ నగర్, స్వతంత్రచౌక్ చౌరస్తాలను కూడా అభివృద్ధి పరుస్తామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రధాన రోడ్లు, కూడళ్ళ సుందరీకరణకు నిధులు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, టిఆర్ఎస్ నాయకులు జేవి రాజు, అచ్చె వేణు, నారాయణదాసు మారుతి, కల్వల సంజీవ్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.