– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం విలేకరి)
గోదావరిఖని (టౌన్), అక్టోబర్ 7ః దేశానికి దిక్సూచిగా దళిత బందు పథకం నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడు, తొమ్మిది డివిజన్లలో మంజూరైన దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బందు పథకం తీసుకువచ్చారన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోనీ అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ సాగంటి శంకర్ కవితా సరోజిని నాయకులు అచ్చే వేణు బోడ్డుపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ కుమ్మరి శారద తోకల రమేష్ యాసర్ల తిమోతి ధరని పోశం తదితరులు పాల్గొన్నారు