(ప్రజాలక్ష్యం ప్రతినిధి) :
గోదావరిఖని, సెప్టెంబర్ 24: ఉపాధ్యాయ దినోత్సవం, ఇంజనీరింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు, ఇంజనీర్లకు గురువారం రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గోవిందుల సుచరణ్, మండల విద్యాధికారి బద్దం డానియల్, ఉపాధ్యాయులు వేముల లక్ష్మీనారాయణ, కల్లూరి విజయలక్ష్మీ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుగ్గిళ్ళ రవీంద్రచారి, లక్కం బిక్షపతి, గుండా రాజు, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, బంక రామస్వామి, డాక్టర్ వెంకటేశ్వర్లు, మేడిశెట్టి గంగాధర్, గోపాల్ రావు, బేనిగోపాల్ త్రివేది, ఆంజనేయులు, సుధాకర్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.