Home తెలంగాణ ఈపీ ఎలక్ట్రిషీయన్‌లకు ప్రాక్టికల్‌ పరీక్షలు

ఈపీ ఎలక్ట్రిషీయన్‌లకు ప్రాక్టికల్‌ పరీక్షలు

526
0
conducting practicals
Officers conducting practical tests

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

గోదావరిఖని, సెప్టెంబర్‌ 24: సింగరేణి ఆర్‌జీ-3 పరిధి ఓసీపీ-1లో ఈపీ సీనియర్‌ ఎలక్ట్రిషీయన్‌ (ఈఎక్స్‌సీ) క్యాటగిరి-ఏ ప్రాక్టికల్‌ పరీక్షలు గురువారం నిర్వహించారు. పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌ రమేష్‌ పర్యవేక్షణలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షలు కమిటీ సభ్యులు ఓసీ-1 పీఓ టి.శ్రీనివాస్‌రావు, డీజీఎం (పర్సనల్‌) వలాస్‌ శ్రీనివాస్‌ పొద్దార్‌, డీజీఎం ఆర్‌.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరీక్ష కోసం 8 మందిని పిలువగా 7 గురు హాజరయ్యారు. కోవిడ్‌ -19 జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షలను ఆర్‌జీ-1 సీనియర్‌ పీఓ నారియన్‌ చక్రవర్తి, ఆర్‌జీ-1 పీఓ దేవాచారి, కె.మురళీధర్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here