నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట గ్రామంలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఆలయ చైర్మన్ కొలన్ శ్రీనివాస్ రెడ్డి మహా హోమము నిర్వహించారు. ఈ హోమము నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశ్యము ఈ కరోన మహమ్మారి బారి నుండి దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలకు ఎటువంటి హాని రాకూడదని హోమం నిర్వహించ బడినది. అలాగే మన ఆయురారోగ్యాలు బాగుండాలని ఎంతో తపన పడుతున్న టువంటి నిరంతరం ప్రజల గురించి ఆలోచించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారికి ఆ దుర్గ అమ్మవారు ఎంతో ఆయురారోగ్యాలను ఇచ్చి వారు ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారిని మనసా వాచా కర్మ లేకుండా ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు ఈ కరోన మహమ్మారి బారిన పడకుండా చూడాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ని కనక దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు.
కరోనా బాధితుల సహాయార్థం రూ. లక్ష విరాళం – కోలన్ నవీన్ రెడ్డి
ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ గారి పిలుపు మేరుకు ‘కరోనా వైరస్‘ బాధితుల సహాయార్థం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన (nri) కోలన్ నవీన్ రెడ్డి ఐర్లాండ్ లో చదువుతూ తనవంతు బాధ్యతగా రూ.1, 00, 000/లక్షరూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వబడింది. ఈ చెక్ ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , యూత్ లీడర్ ఆనంద్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కు తన క్యాంపు కార్యాలయం వద్ద చెక్కును అందచేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బాధితులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో దాతలు ముందుకు రావడం సంతోషకరమని, ఎంతో ప్రమాదకరంగా భావించే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావద్దని, ప్రభుత్వం చెబుతున్నట్లుగా అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే ‘కరోనా వైరస్‘ను అరికట్టవచ్చని అన్నారు. అలాగే కరోన మహమ్మారి ని అరికట్టడానికి స్వచ్ఛందంగా తమ వంతుగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు