Home తెలంగాణ సామాజిక దూరంతోనే కరోనా దూరం – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సామాజిక దూరంతోనే కరోనా దూరం – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

362
0

జగిత్యాల: ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో నే ఉండడంతో పాటు సామాజిక దూరం పాటించినట్లయితే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని అజారీ మజీద్ వద్ద మోసిన్ ఆధ్వర్యంలో 15వేల విలువ చేసే మాస్క్ లు, శానిటైజర్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముస్లీంలకు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు స్వీయ గృహ నిర్బంధంలో నే ఉండి ప్రభుత్వాల ఆదేశాలు పాటించడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దనీ, మార్కెట్లు, మెడికల్ షాపులు, రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించీ కరోనా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం పేదలను, వలస కార్మికులను, అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటుందని తెలిపారు.

పోలీసులు, వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్ బాధితుల కు సేవలు అందిస్తున్నారనీ, దాంతో పాటు వ్యాధి నివారణకు పాటు పడుతున్నారనీ వారి సేవలను గుర్తించి, ఎవరుకూడ బయటకు వెళ్ళవద్దని సంజయ్ కుమార్ కోరారు. ఎమ్మెల్యే వెంట మైనార్టీ ప్రెసిడెంట్ ముజ్జూ, ఖాజీమ్ అలీ, రియాజ్ మామ, ఎతెమాద్, జావీద్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here