Home తెలంగాణ ప్రధాన రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తిచేయాలి

ప్రధాన రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తిచేయాలి

888
0
Review Meeting
MLA Kurukanti Chandar talking to RG-I GM

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి
– ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 16: గోదావరిఖనిలోని మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆఫీస్‌ నుండి 5వ ఇంక్లయిన్‌ వరకు ఉన్న ప్రధాన రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. బుధవారం ఆర్జీవన్‌ జియం కె.నారాయణ, ఇతర అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు రామగుండం కార్పోరేషన్‌ కార్యాలయం నుంచి 5వ ఇంక్లయిన్‌ వరకు 100 ఫీట్ల రోడ్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలు కోరుకునే సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని జియంకు సూచించారు. గోదావరిఖని పట్టణంలో నిరుపయోగంగా ఉన్న స్థలాల్లో పార్కు నిర్మాణాలు చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆర్జీవన్‌ ఏరియా పరిధిలోకి అన్ని గనుల వద్ద కరోనా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో కార్మిక వాడల్లో సీజనల్‌ వాధ్యులు వచ్చే అవకాశం ఉందని, వాడల్లో బ్లీంచింగ్‌ చేయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన భవనాల నిర్మాణాల కోసం స్థలాలు కేటాయించాలన్నారు.

ఈ సందర్భంగా జియం కె.నారాయణ  మాట్లాడుతూ కరోనా నివారణ చర్యల్లో భాగంగా అన్ని ఏరియాలలో, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ హైపో క్లోరైడ్ ద్రావణం పిచ్చికారి చేపించామని, ఇప్పటి వరకు అర్జీ-1 ఏరియాలో 35,000 వేల మాస్కులను ఉద్యోగులకు పంపిణీ చేసామని, ఉద్యోగుల సౌకర్యార్థం స్ప్రే సానిటైజర్ బాటిల్లను గనులు మరియు డిపార్ట్ మెంట్ లలో పంపిణీ చేశామని, కరోనా కట్టడికి తీసుకూవలసిన అన్నీ జాగ్రత్త చర్యలను తీసుకుంటునామని జియం ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటి మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌ రావు, ఆర్‌.జీ.వన్‌ జీఎం నారాయణ, కార్పోరేటర్‌ దాతు శ్రీనివాస్‌ నాయకులు బోడ్దు రవీందర్‌ జే.వి.రాజు అధికారులు రమేష్‌, నవీన్‌ కుమార్‌, సర్వేశ్వర్‌, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here