– ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 18: రామగుండంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సిఎం కేసీఆర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్‌తో కలిసి ఎమ్మెల్యే వినతి పత్రం అందించారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల భూములు రిజస్టేషన్ల కోసం దాదాపు 30 కిలోమీటర్ల దూరం వెళాల్సివస్తుందని తెలిపారు. దీనిని అధిగమించేందుకు రామగుండంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ ప్రాంత ప్రజల రిజిస్ట్రేషన్ల ఇబ్బందులు తొలిగిపోతాయని రామగుండంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకులంగా స్పందించారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.