– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 13: తెలంగాణ ఉద్యమానికి దిక్చూచిగా నిలిచిన చౌరస్తాలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల ప్రాణాల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. తెలంగాణ రాష్ర్టసాధనోద్యమంలో రామగుండం నియోజవర్గానికి ఇంచార్జ్ గా ఉన్నానని, ఆ సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపై తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ప్రధాన చౌరస్తాలో ఉవ్వెత్తున నడిపించామన్నారు. అమరవీరుల స్థూపం నిర్మించాలని గతంలోనే దరఖాస్తు చేశామన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సంవత్సర కాలంలోపే తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు అడ్డాల గట్టయ్య, బాలరాజ్ కుమార్, దొంత శ్రీనివాస్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బొడ్డు రవీందర్, ర్యాకం వేణు, జే.వి.రాజు, వంగ శ్రీనివాస్ గౌడ్, తానిపార్తి గోపాల్ రావు, పి.టి స్వామి, అచ్చె వేణు, తోడేటి శంకర్ గౌడ్, చెలకపల్లి శ్రీనివాస్, బోడ్డుపల్లి శ్రీనివాస్, సీరాజోద్దిన్, పీచర శ్రీనివాస్, నీలరపు రవి, ఇరుగురాళ్ల శ్రావన్, మేకల అబ్బాస్, బూరుగు వంశీకృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.