– మహిళ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ యం సురేందర్
(ప్రజాక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 13: వేధింపులను ఎదుర్కొనే మహిళలు, విద్యార్థినిలు షీటీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ యం సురేందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మహళలు, విద్యార్థినిలు ఎదుర్కొనే ఇబ్బందులను మౌనంగా భరించకూడదని, షీటీంల ద్వారా పరిష్కరించు కోవాలని చెప్పారు.
కమిషనరేట్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. మహిళలు, విద్యార్థులు నుండి అందే ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కరిస్తాన్నామని చెప్పారు. మహిళలు, విద్యార్థినిలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేయాల్సిన అవసరం లేదని, వాట్సాప్, సెల్‌ఫోన్, హాక్‌ఐయాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అన్నివర్గాల ప్రజల సౌకర్యార్ధం పోలీస్‌శాఖ అందుబాటులోకి తీసుకవచ్చిన హాక్‌ఐ యాప్‌ను స్మార్ట్‌ఫోన్ కలిగిఉన్న ప్రతిపౌరుడు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. షీబృందాలకు చెందిన సభ్యులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నామని చెప్పారు.
ఈయాప్‌లో మహిళ భద్రత కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కువరద్దీ, పోకిరీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఆయాప్రాంతాల్లో వారి ఆగడాను నియంత్రించేందుకు మఫ్టీలో వున్న పోలీసులతో నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. పోకిరీలను ఆధారాలతో పట్టుకునేందుకు ఆధునికసాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నామని తెలిపారు.