(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జనవరి 27: మ్యారేజీ బ్యూరోల నిర్వాహకుల ఆత్మగౌరవం కోసమే మ్యారేజీ బ్యారో అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటి ఎంబీఏ-జాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాణ కమిటి రథసారధి సాగే సుమోహన్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వివాహా సంబంధాల నిర్వాహకులతో పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర మేదరి (మహేంద్ర) మ్యారేజ్ బ్యూరో లింక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాక అధ్యక్షులు పిల్లి రాజమౌళిని గోదావరిఖనిలో కలిసారు. ఈ సందర్భంగా సాగే సుమోహన్ ఎంబీఏ-జాక్ కమిటి నిర్మాణం, జాక్ ఉద్ధేశ్యాలు, దాని ప్రయోజనాలు, ప్రభుత్వ పరంగా పొందాల్సిన సహాయ సహాకారాలు గురించి వివరించి జాక్‌కు మద్ధతు కోరారు. ఎంబీఏ-జాక్‌కు తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు పిల్లి రాజమౌళి ప్రకటించారు.
ఈ సందర్భంగా పిల్లి రాజమౌళి మాట్లాడుతూ ప్రభుత్వాల పరంగా మ్యారేజ్ బ్యూరోలకు సరైన గుర్తింపు పొందాలనే ఉద్దేశ్యంతో సాగే సుమోహన్ ఎంబీఏ-జాక్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామని తెలిపారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు మ్యారేజ్ బ్యూరోల వ్యవస్థలను గుర్తించకపోవడం చాలా బాధకరమని, చదువుకున్న నిరుద్యోగులమైన తాము స్వయం కృషితో మా కుటుంబాలను పోషించు కోవడానికి జీవనోపాధిగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని, ఇలాంటి సందర్బాల్లో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవారి ద్వారా అనేక ఇబ్బందులు, కష్ట నష్టాలను ఎదుర్కొంటు నప్పటికి మ్యారేజ్ బ్యూరోల నిర్వహణకు సరైన గుర్తింపు లేదని తెలిపారు. ప్రభుత్వం మ్యారేజీ బ్యూరోలను గుర్తించి నిరుద్యోగ యువతకు తగిన ప్రోత్సాహం అందిచాల్సిందిగా కోరారు. జాక్ ఐక్యతకు అన్ని మ్యారేజ్ బ్యూరోల నిర్వాహకులు కలిసి రావాల్సిందిగా పిల్లి రాజమౌళి కోరారు.