– అసెంబ్లీలో గళమెత్తిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్య ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 14: రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన గళమెత్తారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల అవసరాన్ని అసెంబ్లీలో వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
రక్తాన్ని చేమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తోంది సింగరేణి గని కార్మికులని, దినదిన గండం నూరెళ్ల ఆయుస్సు అన్న చందంగా కార్మికుల జీవిస్తున్నారని తెలిపారు. కార్మికులు అనార్యోగాల బారిన పడి ప్రమాదకర స్థితిలో అసుప్రతిల్లో చేర్పించాలంటే గోదావరిఖని నుండి హైదారబాద్ కు తరలించే ప్రయత్నంతో మధ్య మార్గంలో మృత్యువాత పడుతున్న సంఘటనలున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రామగుండంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
కారుణ్య నియామకాలతో కార్మికుల్లో వెలుగులు
కారుణ్య నియమాకాల ద్వారా కార్మికుల వారసులకు ఉద్యోగాలు అందించి వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. అసెంబ్లీలో సింగరేణి కార్మికుల సమస్యల గురించి చందర్ మాట్లాడారు. సింగరేణి గని కార్మికుల తల్లిందండ్రులు ఉచిత వైద్యం అందించడంతో పాటు, కార్మికుల ఇండ్ల నిర్మాణం కోసం 10లక్షల వరకు వడ్డీలేని రుణం, ఇచ్చిన హామీలను నేరవేర్చిన సిఎం కేసీఆర్ సింగరేణి గని కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు పేర్కొన్నారు.
కారోనా వ్యాప్తి సమయంలో సింగరేణి గని కార్మికులకు సగం వేతనం ఇచ్చారని, వారికి పూర్తి వేతనం ఇవ్వాలన్నారు. కార్మిక క్షేత్రంలో సింగరేణి ఆధ్వర్యంలో కె.వి స్కూల్ ఏర్పాటు చేయాలని పెర్కొన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు సింగరేణి సమస్యలపై గాని వారి సంక్షేమంపై పట్టింపు ఉండేంది కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ భాద్యతలు తీసుకున్నాక సింగరేణి గని కార్మికులను తమ వద్దకు స్వయంగా పిలుచుకుని వారి సమస్యల అడిగి పరిష్కరించిన కార్మిక పక్షపాతి సిఎం కేసీఆర్ అని తెలిపారు. కార్మికుల హక్కుల సాధననే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందరి తెలిపారు.