(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్ సెప్టెంబర్ 1: దివ్యాంగుల సమస్యలపై సమీక్షా సమావేశం మంగళవారం రోజున హైదరాబాద్ లోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ అధికారులతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వాటి పరష్కారానికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని తెలిపారు. అదే విధంగా వాళ్ళకి ప్రభుత్వం నుండి అమలు అవుతున్న సంక్షేమ పథకాలు పెన్షన్, రేషన్ కార్డులు మొదలగు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరి నుండి సంబంధిత వివరాలు సేకరించి పూర్తి వివరాలతో ముఖ్యమంత్రికి సమర్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, డైరెక్టర్ శైలజ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సంతాపం
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఆయన గౌరవార్థంగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఏడూ రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉదయాన్నే సంతాపం తెలిపే రోజులల్లో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయంలో ప్రణబ్ ముఖర్జీకి సంతాపం వ్యక్తం చేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రయం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమీవేశాల సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కొప్పుల
ఈ రోజు హైదరాబాద్ లోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు ఆఫీసులో సెప్టెంబర్ 7తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాలు సంసిద్ధత గురించి సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ ప్రభుత్వ సలహాదారు ఏ. కే . ఖాన్, మైనారిటీ కార్యదర్శి నదీం అహ్మద్, ఎస్సీ ప్రత్యేక కార్యదర్శి, విజయ్ కుమార్, ఎస్.సి.డి.డి. కమిషనర్ యోగిత రాణ, మైనారిటీ డైరెక్టర్ సహనాజ్ ఖాసిం, ఎస్సి గురుకుల కార్యదర్శి అర్. యస్. ప్రవీణ్ కుమార్, మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫియుల్లా, ఎస్సీ కార్పరేషన్ ఎం.డి కరుణాకర్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎ.డీ కాంతి వెస్లీ, ఎస్.సి.డి.డి. అడిషనల్ సెక్రటరీ రాజ సులోచన, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.