– దశాబ్దాల మెడికల్ కళాశాల కల నేరవేర్చా
– రామగుండాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతా
– కోవిడ్ నిబంధనలతో ఘనంగా దసరా వేడుకలు
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 16ః రామగుండం ప్రజానీకం తనపై పెట్టుకున్న ఆశలను, నమ్మకాన్ని ఏ మాత్రం ఓమ్ము చేయకుండా వారికి సేవలు అందిస్తున్నానని, ప్రజల అకాంక్షలు నెరవేర్చేందుకు నిత్యం శ్రమిస్తున్నానని, రామగుండం ప్రజల సేవకే నా జీవితం అంకితమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పునరుద్ఘాటించారు. శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని జవహర్‌లాల్ స్టేడియంలో దసరా ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర సంక్షేమ మంత్రివర్యులు కోప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కోవిడ్ సకల వర్గాలను అర్దికంగా నష్టం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో రెండు సంవత్సరాలుగా దసరా ఉత్సవాలని నిర్వహించలేక పోయామని తెలిపారు. ఈసారి కోవిడ్ తగ్గుముఖం పట్టినా, కోవిడ్ నిబంధనలు పాటిస్తు దసరా ఉత్సవాలను నిర్వహించ మన్నారు.
రామగుండం ప్రజల దశాబ్దాల మెడికల్ కళాశాల కలను రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్యలు కేటిఆర్, కోప్పుల ఈశ్వర్, సహకారం అందించారన్నారు. రాష్ట్ర మంత్రివర్యలు కేటిఆర్ ఆశీస్సులు తో అతి త్వరలోనే IT పార్కు ఎర్పాటు చేయబోతున్నామని, తద్వారా రామగుండం ప్రాంతంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రం లొనే అగ్రగామిగా నిలుపుతామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల అకాంక్షలన్ని నేరవేర్చుతానన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి ఆభిషేక్ రావు కమీషన్ శంకర్ కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.