Home తెలంగాణ మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే – జిల్లా కలెక్టర్ కె.శశాంక

మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే – జిల్లా కలెక్టర్ కె.శశాంక

358
0
Plant care
Colector inspecting plants care along Rajiv Highway

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్ సెప్టెంబర్ 11: రాజీవ్ రహదారి వెంట నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే అని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. శుక్రవారం ముగ్దుంపూర్ నుండి కరీంనగర్ వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంట్ వైర్ల కింద పూలు, తక్కువ ఎత్తు ఎదిగే మొక్కలను నాటాలని అన్నారు. అలాగే రక్షణ కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాతి అధికారి బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here