Home తెలంగాణ ప్రభుత్వ భూములు కాపాడాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రభుత్వ భూములు కాపాడాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక

392
0
Collector K.Shashanka speaking at meeting

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 11: శాఖలు వేరైనా సమస్య ఒక్కటే పోలీసు, రెవిన్యూ, పంచాయితీ రాజ్ శాఖలు సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ భూములు కాపాడాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సి.పి. కమలాసన్ రెడ్డి, తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాతీరాజ్ కు సంబంధించి 2010-11 తర్వాత బొమ్మకల్లు గ్రామ పంచాయితీకి జరిగిన వివిధ రకాల పనులపై తనిఖీ చేయడం జరిగిందన్నారు. కమర్షియల్ స్ట్రక్చర్స్ కు ఎన్ని పర్మిషన్లు ఉన్నవి లేనివి పంచాయితీ రాజ్ వారు తెలపారని ఆయన అన్నారు.

కమర్షియల్ స్ట్రక్చర్ కు ప్రాపర్టి ట్యాక్స్ ఎంత మంది కడుతున్నారు, ఎంత కడుతున్నారు, వాళ్లకు ఉన్నా స్ట్రక్చర్ కి ఎంత తేడా వస్తుందని అని అన్నారు. రిజిష్ట్రర్ ప్రకారం ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, ప్రాపర్టి ట్యాక్స్ లొ 17 వందలు కొత్త ప్రాపర్టి ట్యాక్స్ ప్రకారం కట్టినట్టు ఉందని, కలెక్షన్ పరంగా మాత్రం 14 వందలే ఉందని ఆయన అన్నారు. 250 పర్మిషన్లు ఇవ్వకుండానే డైరెక్టుగా ఇంటి నెంబర్లు ఇచ్చారని ఆయన తెలిపారు.

రెవెన్యూ మరియు సర్వే కన్ఫర్మేషన్ మేరకు ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టుకున్నా వారికి పర్మిషన్ ఎలా ఇచ్చారు అన్నా దానికి క్యాన్సలేషన్ మొదలు పెట్టడం జరిగిందని ఆయన అన్నారు. వచ్చిన నిధులలో ఎంత మేరకు ఉపయోగించుకున్నారు, పనులు చేయకుండా ఎక్కడైనా తీసుకున్నరా, లేదా దేనికి వాడారో దానికే వాడారా అన్నది పరిశీలిస్తున్నామని అన్నారు. కొందరు పంచాయితీ సెకరేటరీలు, ఎం.పి.వో.లకు అందరికి ఇందులో ఇన్ వాల్మెంట్ ఉందని, వీరి పై శాఖపరమైన చర్యలు తీసుకుని వారిని పంపించాలని అన్నారు. ఇక మీదట ఇలా జరకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆయన అన్నారు.

అలాగే ఎన్ క్రోచ్ అయిన భూమి  వెనక్కి తీసుకొవాలని, గుర్తించిన అన్ని భూములలో బోర్డులు పెట్టాలని అన్నారు. రాళ్ళతో బౌండరీలు వేసి కలర్ వేసి జియో ట్యాగింగ్ చేయాలని, భూములను ఆక్రమించుటకు ప్రోత్సహించిన వారిపై కేసులు పెట్టాలని, రికార్డులలో కరెక్ట్ గా ఉందా లేదా అని పరిశీలించి అధికారులు వారిపై చర్య తీసుకొవాలని అన్నారు.

జిల్లాలో ఈ విధంగా మరే గ్రామంలో జరగకుండా ఉండే విధంగా కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. వెనుకకు తీసుకున్న భూములను ప్రభుత్వ అవసరాలకు కేటాయించాలని అన్నారు. ఇప్పటివరకు భాద్యతగా పనిచేశారని,  అదే స్పూర్తి తో ఇకముందు కూడా కొనసాగించి రిపోర్టు కూడా తొందరగా ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

అనంతరం పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మకల్ గ్రామంలో భూములను ఆక్రమించిన వారిని గుర్తించుటకు రెండు పోలిస్ బృందాలను ఏర్పాటు చేసి  భూ ఆక్రమణకు పాల్పడిన 17 మందిపై కేసులు పెట్టామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు,  ఏ.సి.పి. రష్మీ పెరుమాళ్, జిల్లా పంచాయితీ అధికారి బుచ్చయ్య, ఆర్.డి.వో. ఆనంద్ కుమార్, ఎమ్మార్వోలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here