– ప్రజల వద్దకే నేరుగా పాలన
– రాష్ట్రంలో గోప్పగా సిఎం కేసీఆర్ పాలన సాగుతుంది
– పేదలను కడుపులో పెట్టుకుని కాపాడుతున్న తెలంగాణ ప్రభుత్వం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం విలేకరరి – రామగుండం నియోకరవర్గం)
సెప్టెంబర్ 3: సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజల వద్దకే నేరుగా పాలనను అందించడం కోసం పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే కోరుకంటి
చందర్ తెలిపారు. బుధవారం రాత్రి అంతర్గాం మండలం మురుమూర్ గ్రామంలో ఎమ్మెల్యే పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రి మురుమూర్ గ్రామంలో బసచేసి ఉదయం గ్రామ సందర్శన చేపట్టారు.
ప్రజలు ఎద్కుకొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతుందని, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ, పెద ప్రజలకు అపన్నహస్తం అందిస్తూ వారి కళ్లలో అనందం నింపుతున్న ఎకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కడుపులో ఉన్న పసిపాప నుండి పండుముసలి వరకు పధకాలను అమలు చేస్తు పేదలను కడుపులో పెట్టుకుని కాపాడుతున్నది తెలంగాణ ప్రభుత్వమన్నారు. గర్భిణి స్త్రీలకు పౌస్టికాహరం నుండి మొదలుకుని ప్రసవం వరకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు బాబు పుడితే 12వేలు, పాప పుడితే 13 వేలుతో పాటు కేసీఆర్ కిట్ ను ప్రభుత్వం అందిస్తుదన్నారు. రైతుల కళ్లలో అనందం నింపేందుకు పెట్టుబడి సాయంగా రైతు బంధును అందించండం జరుగుతుంన్నారు. ఒంటరి మహిళలకు, వృద్ధులకు అసరా పధకం ద్వారా 2వేల రూపాయలు అందించి వారికి అర్ధిక భరోసాను కల్పింస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాజుదారి తనంగా ఉండాలని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి దుర్గం విజయ, జడ్పీటిసి అముల నారాయణ, వైస్ ఎంపిపి మట్టలక్ష్మీ- మహేందర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ గౌస్ పాషా, సర్పంచులు బాదరవేణ స్వామి, ధరణి రాజేష్, సతీష్, బండారి ప్రవీన్, మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తిరుపతినాయక్, నాయకులు కోల సంతోష్, ఎలుక కొమురయ్య, నువ్వుల సంతోష్, కుమార్ అధికారులు బండి ప్రకాష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.