(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని సెప్టెంబర్ 3: సింగరేణి సిఅండ్ఎండి ఎన్. శ్రీధర్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి గురువారం రోజున అన్ని ఏరియాల జియంలతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఅండ్ఎండి మాట్లాడుతూ అర్జీ-1 ఏరియాలో అన్ని గనులలో ఉత్పత్తి మరియు ఉత్పాదకత సాధించాలని, వెనుక బడిన ఉత్పత్తికి సంబందించిన పునః సమీక్షా జరపాలన్నారు. ఒ.సి 5 కు సంబందించి జనవరి, ఫిబ్రవరి 2021 లో బొగ్గు ఉత్పత్తి వచ్చేలా ప్రణాలికలు సిద్దం చేసుకోవాలన్నారు ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్జీవన్ ఏరియా జియం కె నారాయణ పాల్గొని మాట్లాడుతూ గనులు మరియు డిపార్ట్ మెంట్ లలో కరోనా నివారణకు ఆర్జీవన్ ఏరియా పక్ద్బంది ఏర్పాటు చేర్యలను చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 35000 వేల మాస్కులను ఉద్యోగులకు పంపిణీ చేశామని ,(టాక్టర్ మౌంటెడ్ స్ప్రెయర్ మరియు పిచికారి యంత్రం ద్వారా 7500 కిలోల హైపో క్లోరైడ్ ద్రావణం తో పిచి కారి చేయటం జరిగిందని, 5000 లపైచిలుకు సానిటైజర్ బాటిల్ లను ఉద్యోగులకు పంపిణీ చేశామని చెప్పారు. గనులు మరియు డిపార్ట్ మెంట్ లలో మాస్కులు, సానిటైజర్ లు, హైపో క్లోరైడ్ ద్రావణం, థర్మల్ స్కానర్స్, పల్స్ అక్సోమీటర్లు, హ్యాండ్ వాష్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఏరియా హాస్పిటల్ లో మొత్తం 2525 కరోనా టెస్ట్ లు చేయగా, 496 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయిందని, కరోనా వ్యాదిగ్రస్తుల కోసం ఏరియా హాస్పిటల్ మరియు కమ్యూనిటి హాల్ లో 140 పడకలను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనాకు సంబందించిన అన్ని రకాల నివారణ చర్యలను పకడ్బందిగా నిర్వహిస్తున్నామని, అదే విధంగా ఆర్జీవన్ ఏరియాలో కరోనా వైరస్ మరియు వర్షా భావం కారణంగా తగ్గిన ఉత్పత్తి మరియు ఉత్పాదలత, సెప్టెంబర్ 4వ తేదీ నుండి మేడిపల్లి ఒపెన్ కాస్ట్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, హై వాల్ మైనింగ్ (3ఎ సిమ్) నుండి బొగ్గు ఉత్పత్తి చేయబడుతుందని పేర్కొన్నారు. జీడికే 5 ఉపరితల గని ప్రాజెక్ట్ కు సంబందించిన నాళాల పనులు మరియు రోడ్లు పనులు, ఇప్పటి వరకు చేపట్టిన పనుల గురించి వివరించారు, జీడికే 5 ఉపరితల గని కి సంబందించిన భూసేకరణకు సంబందించిన విషయాలను సిఅండ్ఎండి వివరించటం జరిగింది.