Home తెలంగాణ గడప గడపకు గులాబీ సైన్యం

గడప గడపకు గులాబీ సైన్యం

746
0
MLA Korukanti Chander releasing Pamphlete
MLA Korukanti Chander releasing Pamphlete

– వినూత్న రీతిలో సాగ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం…
– భారీ మెజార్టీయే ల‌క్ష్యం…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
హాలియా (నాగార్జున‌సాగ‌ర్‌), మార్చి 27 హాలియా ప‌ట్ట‌ణంల‌లో వినూత్న రీతిలో సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు రామ‌గుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌. విల‌క్ష‌ణ‌మైన కార్య‌క్ర‌మాల‌తో కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపుతున్నారు.

బ‌రోసా స‌మావేశాలు, క‌వాతులు. గ‌డ‌ప ‌గ‌డ‌ప‌కు గులాబీ సైన్యం పేరిట ప్ర‌తి ఒక్క‌రి క‌లుస్తూ వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుంటూ, సంక్షేమ ప‌థ‌కాలు స‌రిగ్గా అందుతున్నాయా, కేసీఆర్ పాల‌న ఎలా వుంద‌ని ప్ర‌తి ఒక్క‌రిని అప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ హాలియా ప్ర‌జ‌ల మ‌న్న‌ల‌ను పొందుతున్నారు. భారీ మెజార్టీయే ల‌క్ష్యంగా ప్ర‌తి కార్య‌క‌ర్తను కార్యోన్ముఖుల‌ను చేస్తూ ముందుకు పోతున్నారు.

Activists doing gadapa gadapa padayatra
Activists doing gadapa gadapa padayatra

శనివారం 1వ వార్డు లో గడప గడపకు గులాబీ సైన్యం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌ పాదయాత్ర చేపట్టారు. వార్డులో టిఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల కార్యాలయాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు.

MLA Chander inaugurating the election office
MLA Chander inaugurating the election office

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలుస్తుంది టిఆర్ఎస్‌ ప్రభుత్వమన్నారు. వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు భరోసాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని, ప్రతి నెలా రెండు వేల రూపాయల పెన్షన్ అందిస్తూ వారిని గౌరవంగా బతికేలా చూస్తున్నార‌న్నారు.

MLA Korukanti Chander seeking votes of everyone
MLA Korukanti Chander seeking votes of everyone

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సంద‌ర్భంగా ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్మన్ పార్వతమ్మ శంకరయ్య , రాష్ట్ర నాయకులు మలిగి రెడ్డి లింగ రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్ రావు , వైస్ చైర్మన్ సుధాకర్ రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యులు చాపల సైదులు వార్డు లోని టి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, మహిళలు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here