(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైద్రాబాద్, సెప్టెంబర్ 21: నార్సింగి మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ గా వంజరి నరేష్ ను నియమిస్తూ నియామక పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజక వర్గంలో రానున్న రోజుల్లో ప్రజా ఏక్తా పార్టీ బలమైన పోటీ ఇస్తుందని, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తామని అన్నారు. జాతీయ అధ్యక్షుని సమక్షంలో సుమారు 50 మంది యువకులు మరియు మహిళలు కండువాలు వేసుకొని పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎంకె నరేందర్ మంజరి రాజు. శ్రీనివాస్. యోగేష్.మయూర్ మల్లేశం. అరుణ్. సాయి తేజ్. వంశీ. సంపత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు