(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పెద్దపల్లి, సెప్టెంబర్ 20: ఊర పంది మాంసంను, అడవి జంతువుల మాంసంగా అమ్ముతూ ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్న ముఠాను పెద్దపల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేసారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్ఐ కె.రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఊర పంది మాంసంను అడవిలో తిరిగే జింక, దుప్పి, అడవి పంది మాంసంగా ప్రజలకు విక్రయిస్తున్నారని తెలిపారు. అడవి జంతువులను వెంటాడి చంపినట్లుగా వాట్సాప్ లో ఫోటోలు పెడుతూ ప్రజలను నమ్మించి ఊర పంది మాంసాన్నే అదిక ధరలకు విక్రయిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు ఈరోజు శాంతినగర్ లో ఈ ముఠాకు సంబంధించి లోకిని అంజయ్య (37), రేవెల్లి సంపత్ (32) ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. వీరివద్దనుండి 20 కిలోల ఊర పంది మాంసం 4 కత్తులు, మటన్ కొట్టె మొద్దుకర్ర తరాజు, బాట్లు హీరో హోండా మోటర్ సైకిల్ స్వాదీనం చేసుకున్నామని తెలిపారు.
కాగా లోకిని జంపయ్య, లోకిని గణేష్, లోకిని అనిల్, రేవెల్లి శివాజీ, కుర్ర తిరుపతి, కెదిరి తిరుపతి లు పరారీలో వున్నట్లు ఎస్ఐ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను పెద్దపల్లి డిసిపి అభినందించారు.