(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్ సెప్టెంబర్ 14: పత్తి కొనుగోళ్లకు మార్కెట్ యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. వానాకాలం పత్తి కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశమంధిరంలో అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి రైతులు తమ పత్తిని కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చని తెలిపారు. పత్తి రైతులు తమ పత్తిని నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులకు తీసుకువెళ్లి మద్దతు ధరకు పొందాలని సూచించారు.
మిల్లులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని లీగల్ మెట్రాలజీ అధికారి మరియు జిల్లా ఫైర్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఇతర జిల్లాల నుండి పత్తిని ఈ జిల్లాలోని మిల్లులలో అమ్ముకోవడానికి మిల్లుల కెపాసిటీ మరియు ఆయా గ్రామాల దూరాన్ని బట్టి మిల్లర్లు వినతిపత్రం ఇచ్చినట్లైతే ప్రభుత్వం ద్వారా అనుమతి పొందడానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా అడిషనల్ ఎస్.పి, మదన్, ఎస్.ఇ. ట్రాన్స్ కో మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా ఫైర్ అధికారి వెంకన్న, లీగల్ మెట్రాలజీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.