– పీవీ అంటేనే మన ఠీవి
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 12: దేశ, అంతర్జాతీయ స్థాయిలో రామగుండం నియోజవర్గ కళాకారులు తమ ప్రతిభను చాటారని, కళలకు, కళాకారులకు పుట్టినిళ్లుగా రామగుండం ప్రాంతం నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం 39వ డివిజన్‌లోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో పి.వి.నరసింహరావు శతదినోత్సవాల్లో భాగంగా తారా ఆర్ట్ అకాడమీ, విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో భారతీయ సంప్రదాయ సాంస్కతిక కాళోత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కళాలకు, కళాకారులకు కొదవలేదన్నారు. ఈ ప్రాంతంలోని కళాకారులు కళారంగాల్లో రాణిస్తున్నా రన్నారు. పి.వి నరసింహరావు అంటే మన ఠీవి అని, ఉమ్మడి రాష్ట్రంలో పి.వి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిం దన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పి.వి.శతజయంత్సోవాలను నిర్వహిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారుల కళ ప్రదర్శనలు తెలంగాణ ఉద్యమం మరింత ముందుకు సాగేలా చేశాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పి.వి జయంత్సోవాలు ఈ ప్రాంతంలో నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాంతంలోని కళాకారులకు ఎల్లవేళల అండగా వుంటామని, వారికి సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, ఎంపిపి వాల్వ అనసూర్య-రాంరెడ్డి, కార్పోరేటర్లు జెట్టి జ్యోతి-రమేష్, కన్నూరి సతీష్ కుమార్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి-భూమయ్య, మేకల సదానందం, బాల రాజ్ కుమార్, కవిత సరోజిని, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కాల్వ శ్రీనివాస్, గనుముక్కల తిరుపతి, అచ్చెవేణు, నిర్వాహకులు సంకె రాజేష్, మ్యాజిక్ రాజా, అమరేందర్, దయానంద్ గాంధీ, దామెర శంకర్, సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.