– ఉద్యోగాల కల్పన కోసం ఇండ్రస్టీయల్, ఐటి పార్కులు…
– కోట్లాది నిధులతో నియోజవర్గ అభివద్ది కృషి…
– కారోనా కష్టకాలంలో ప్రజనీకానికి భరోసా…
– విజయమ్మ పౌండేషన్ ద్వారా పేదలకు అండగా…
– అనునిత్యం ప్రజాసేవలో రెండేళ్లు పూర్తి…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 12: గత రెండేళ్లుగా అనునిత్యం ప్రజాసేవలో పునరంకితమవుతూ రామగుండం నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల అక్షాంక్షలు, ప్రజల ఆవసరాలను అనుగుణంగా పనులను నిర్వర్తిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో రామగుండం నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలపాలన్నా తపనతో పరిపాలన సాగిస్తున్నామని తెలిపారు. గత రెండు సంవత్సరాల కాలంగా ప్రజల ఇబ్బందులను కష్టాలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉంటూ ప్రజా సేవే పరమావధిగా భావించి నిరంతరం సేవ చేస్తున్నామన్నారు.
రామగుండం నియోజవర్గంలోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో 1 కోటి 30లక్షలతో 6 రైతు వేదికలు నిర్మాణాలు చేపట్టామన్నారు. ఎంజిఎస్‌ఆర్‌ఎస్ నిధులతో మండలాల్లో 2 కోట్ల 39 లక్షలతో 19 స్మశాన వాటికలు, 14 కోట్ల 69 లక్షలతో సిసి రోడ్లు, అంగన్ వాడి బిల్డింగ్ లు, పాలకుర్తి మండలంలో 7కోట్ల 40లక్షల డిఎంఎస్టీ నిధులతో కమ్యూనటి హాల్ ల నిర్మాణం, అంతర్గాం మండలంలో 8 కోట్ల 91లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టా మన్నారు. 2018-19 గాను ఎన్టీపిపి సిఎస్‌ఆర్ నిధులతో నియోజవర్గంలో 7 కోట్ల 60లక్షలతో అభివద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2019-20గాను 7 కోట్ల 30లక్షలతో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2019-20 గాను రామగుండం కార్పోరేషన్ పరిధిలో సింగరేణి సిఎస్‌ఆర్ నిధులతో అండర్ గ్రౌండ్డ్రై నేజీలు, సిసి రోడ్లు నిర్మాణం చేశామన్నారు. అంతేకాకుండా విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి మార్గాల కల్పన కోసం మహి మహిళా సాధికారత కేంద్రాలను నెలకొల్పామని తెలిపారు.
రామగుండ నియోజవర్గంలో మొత్తంగా 1400 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రగతి కింద ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ట్రాలీ అందించడం జరిగిందన్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిన రాజీవ్ రహదారి ఇరువైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. మిషన్ భగీరధ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగునీరు అందిస్తున్నమని, మారెడుపాక గ్రామంలో 24గంటలు త్రాగునీరు అందిస్తున్నమని తెలిపారు. పారిశుద్ధ్య విభాగాన్ని ప్రక్షాలనలో భాగంగా రిక్షాలను తొలగించి వాటి స్థానంలో ఆటో ట్రాలీను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. చెత్త రహిత రామగుండం మార్చలన్న సంకల్పంతో 1కోటి 15 లక్షలతో జటింగ్ మిషన్, స్టాటిక్ కంపోస్టర్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటిఆర్‌లు ఈ ప్రాంతంలో ఇండ్రస్టీయల్, ఐటి పార్కు ఏర్పాటుచేయాలని విన్నవించి సఫలీకతం అయ్యామని తెలిపారు. వచ్చె సంవత్సరం ఈ ప్రాంతంలో ఇండ్రస్టీయల్, ఐటి పార్కులకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. కాంట్రాక్టు కార్మికుల వైద్య సదుపాయల కల్పన కోసం ఈఎస్‌ఎ ఆసుప్రతి మంజూరు కోసం కషి చేశామన్నారు. ఎస్‌ఆర్‌ఎస్ పి ద్వారా నియోజవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నా లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
ఈ సంవత్సరం అనుకోని విపత్తు కారోనా మహమ్మరి రూపంలో సంభవించిందని, కనిపించని శత్రువుతో ప్రజానీకం అంతా యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకోందని, ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు అర్ధ అకలితో అలమటించవద్దని తెల్లకార్డుదారులకు 15 కేజీల బియ్యంతో పాటు 1500 రూపాయలు నగదు అందించడం జరిగిందన్నారు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటిఆర్ ఇచ్చిన పిలుపుతో నియోజకవర్గానికి కధానాయ కులుగా మారి రామగుండం నియోజవర్గంలోని ప్రజలను కరోనా బారినుండి కపాడేందుకు అహర్నిషలు కృషి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని అనార్ధులు, అకలితో అలమటిస్తున్న వారి అకలితీర్చేందుకు విజయమ్మ పౌండేషన్ ద్వారా అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశామని, శానిటైజర్స్, మాస్కులు పంపిణితో పాటు కారోనా పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్, ప్రతి గ్రామంలోని నిరుపేదలకు విజయమ్మ పౌండేషన్ ద్వారా నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణి చేశామని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో రెడ్ జోన్లుగా మారిన అన్నపూర్ణ కాలనీ, జిఎం కాలనీలో ప్రజల నిత్యవసరాలు, బియ్యం పంపిణీ చేయడంతో పాటు కరోనా సోకిన వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తూ వారిలో ధైర్యం నింపామని తెలిపారు. గోదావరిఖని ప్రభుత్వ కరోనా వార్డు ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ప్రాంతంలోని ఆనారోగ్య బాధితుల కోసం ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించామని తెలిపారు. కారోనా మృతులకు వైంకుం ఠధాలను ఏర్పాటు చేశామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిండుకుండలాగా మారిన గోదావరినదిపై రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా తెప్పల పోటీలు నిర్వహించడం జరిగిందని, గోదావరి నదితీరాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రామగుండం నియోజవర్గం సంపూర్ణ అభివృద్ధి చేసి తీరుతానని, దానికి ప్రజలందరు సహకారం అందించాలని కోరారు.
ఈ విలేఖరుల సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అబిషేక్ రావు, కార్పోరేటర్లు పెంట రాజేష్, కోమ్ము వేణుగోపాల్, కన్నూరి సతీష్ కుమార్, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, మేకల సదానందం, బాల రాజ్ కుమార్, దాతు శ్రీనివాస్, కల్వచర్ల కష్ణవేణి-భూమయ్య, కవిత సరోజిని, సర్పంచులు బండారి ప్రవీన్, శ్రీనివాస్ సతీష్, కష్ణ, వెంకటేష్, నాయకులు పాత పెల్లి ఎల్లయ్య, కాల్వ శ్రీనివాస్, జే.వి. రాజు, సలీంబెగ్, నీల గణేష్, గనముక్కల తిరుపతి, పోన్నం లక్ష్మన్, పి.టి స్వామి, బొమ్మగాని తిరుపతిగౌడ్, తిరుపతి నాయక్, తోడేటి శంకర్ గౌడ్, నూతి తిరుపతి, మోతుకు దేవరాజ్, అచ్చె వేణు, ముప్పు సురేష్, భూరుగు వంశీకష్ణ, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.