Home తెలంగాణ మానవీయతను చాటుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

మానవీయతను చాటుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

448
0
Shifted old woman to hospital
MLA Kurukanti Chander shifted old woman to Night shelter

– అనాధ వృద్దులకు భరోసాగా నిలిచి ఆసుపత్రికి, నైట్ షెల్లర్ కు తరలింపు
– ఎమ్మెల్యే చందర్ ను అభినందిస్తున రామగుండం ప్రజానీకం

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఆగష్టు 29: మానవత్వం మంటగలుస్తున్న నేటి సమాజంలో మానవత్వానికి నిజమైనా చిరునామాగా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనార్థులకు అసరాగా, అనాధలకు అదుకోవడమే లక్ష్యంగా విజయమ్మ పౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే శనివారం గోదావరిఖని చౌరస్తాలో ఒక అనాధ వృద్ధురాలు మంధని ధనలక్ష్మీ అనార్యోగంతో బాధపడుతుందన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తానే స్వయంగా అక్కడు వెళ్ళి తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంధని ధనలక్ష్మీ అనే వృద్ధురాలు ఎవ్వరు లేక అనార్యోగంతో బాధపడుతుడంతో ఆసుపత్రికి తరలించి కాలు ఆపరేషన్ చేయించడం జరుగుతుందని, ఆ అమ్మ బాగోగులు చూసుకుంటామన్నారు. వృద్ధురాలికి పూర్తి స్థాయి వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.

Expressed Humanity
Transporting Old woman to hospital

అలాగే గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కన ఓ వృద్ధురాలు ఉంటుదన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక నైట్ షెల్టర్స్ కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. పించన్ తీసుకునేందుకు బయటకు వచ్చిన వృద్ధురాలు వర్షం పడటంతో కుండిలో ఉండిపోయిందని, తిరిగి వృద్ధురాలను నైట్ షెల్టర్స్ తరలించామన్నారు. దీంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసున్న సేవలకు ప్రజలు అభినందిస్తున్నారు.

అనాధలను అదుకోవడం మానవధర్మం – రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

speaking to public
Speaking Ramagundam MLA Korukanti Chandar

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు కె.టి.రామారావు చేస్తున్న సేవ స్ఫూర్తితోనే రామగుండం నియోజవర్గంలో సేవ కార్యక్రమాలు చేపడుతూ అనార్థులకు భరోసా కల్పిస్తున్నామని  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలో ఇద్దరు అనాధ వృద్దులకు అసుపత్రికి, నైట్ షెల్టర్స్ తరలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాధలను అదుకోవడం మానవధర్మమని, మానవ సేవే మాధవ సేవని భావించి నిరాదరణకు గురైన ప్రతి ఒక్కరిని ఇతరులు సాధ్యమైనంత మేరుకు అదుకోవాలని పిలుపునిచ్చారు. రామగుండం నియోజవర్గంలోని నిరాశ్రయులకు, ఆనాధలకు, వృద్ధులకు ఒక కోడుకులాగా తాను అసరాగా ఉంటానని, అనార్ధులకు అండగా ఉంటామని తెలిపారు. అనాధలకు అదుకోవడం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా గుర్తించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, ధర్మశాస్త్ర వేదిక అధ్యక్షులు కౌటం బాబు, 40 డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి, గోలుసు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here