– కరోనా సోకిన మహిళకు కాన్పు
– వైద్యులను, సిబ్బందిని అభినందించిన సింగరేణి డైరెక్టర్ యస్. చంద్రశేఖర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 26: కరోనా సోకిన గర్భిణికి సింగరేణి ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా కాన్పు చేసి బిడ్డకు ప్రాణం పోశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి వైద్యులు ఈ అరుదైన శస్త్ర చికిత్సను సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నిర్వహించి కార్మిక కుటుంబా లలో ధైర్యాన్ని నింపారు.
సింగరేణి రామగుండం ఏరియా హాస్పిటల్ నందు జిడికే 7 యల్‌ఇపి గనిలో లంక రాజా శేఖర్ బదిలీ వర్కర్‌గా పనిచేయుచున్న ఉద్యోగి భార్య స్వర్ణలత ఈ నెల 24న జ్వరం మరియు పురిటి నొప్పులతో బాధపడుతూ సింగరేణి ఏరియా ఆస్పత్రికి రాగా, అత్యవసరంగా ఆమెకు కారోన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఆదే రోజు రాత్రి ఆసుపత్రి వైద్యులు రెండున్నర గంటల పాటు శ్రమించి ఆమెకు శస్త్ర చిత్స ద్వారా కాన్పు చేసారు. దీంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. తల్లి బిడ్డలను వేర్వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ శస్త్ర చిక్సిలక్ష పాల్గొన్న గైనాకాలజిస్టు డాక్టర్ గుండేటి లావణ్య, మత్తు డాక్టర్ జె.మద్దిలేటి మరియు స్టాప్ నర్సు కుసుమ స్వరూప, సింగరేణి వైద్య సిబ్బందికి డైరెక్టర్ ఆపరేషన్ అండ్ పా యస్. చంద్రశేఖర్, రామగుండం ఏరియా జనరల్ మేనేజర్ కె. నారాయణ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ యస్.చంద్ర శేఖర్ మాట్లాడుతూ సింగరేణి వైద్యులు అనేక సందర్భాలలో ఎదురైన క్లిష్ట సమస్యలను ఛాలెంజ్ గా తీసుకుని పరిష్కరించారని తెలిపారు. కరోన పేషంటుకు హైదరాబాద్ లో మాత్రమే చేస్తున్నారని, దానిని స్ఫూర్తిగా తీసుకుని సింగరేణి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. కరోన చికిత్సలో కుడా సింగరేణి వైద్యులు ముందుండి పనిచేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్జి.1 జియం కె. నారాయణ, గుర్తింపు సంఘము ఏరియా ఉఫాధ్యాక్షులు గండ్ర దామోదర్ రావు. ఏసీయంఓ వెంకటేశ్వరరావు, డా మద్దిలేటి, డా రవీంద్ర, యస్. ఓ టు జియం త్యాగరాజు. డిజియం సివిల్ నవీన్, పర్సనల్ మేనేజర్ యస్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.