Home తెలంగాణ వలస కూలీలకు బియ్యం నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చందర్

వలస కూలీలకు బియ్యం నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చందర్

721
0
MLA Korukanti chandar

గురువారం రామగుండం మున్సిపాలిటీ లోని 14వ డివిజన్ లక్షిపూరం లోని లెబర్ క్యాంపుల్లోని 2000 మంది కూలీలకు బియ్యం, నగదును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ

కరోనా వ్యాధి నేపద్యంలో రాష్ట్రంలో ఉండిపోయిన ఇతరరాష్ట్రాల కూలీలకు, కార్మికులకు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా వారికి అర్ధిక భరోస కల్పిస్తూ ఒక్కోకరికి 12కేజీల బియ్యం, 500 రూపాయల నగదు అందించి మరోమారు సిఎం కేసీఆర్ గారు దేశ ప్రజలతో మనసున్నమహరాజు గా కీర్తించబడుతున్నారని అన్నారు. ఈ విపత్కకర పరిస్థితుల్లో వలస కులీలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి వారి ఆకలిని తెలంగాణ ప్రభుత్వం తీర్చుతుందన్నారు. వలస కూలీలు ప్రభుత్వం సూచించిన రక్షణ సూత్రాలను పాటించాలనీ, సంబంధిత కాంట్రాక్టర్లు కూలీల అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాని సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ నీల పద్మ, నీల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here