Home తెలంగాణ కోవిడ్-19 వాలంటీర్స్ కి టీ షర్ట్స్ పంపిణీ చేసిన ASR ఆర్మీ

కోవిడ్-19 వాలంటీర్స్ కి టీ షర్ట్స్ పంపిణీ చేసిన ASR ఆర్మీ

473
0
ASR Army

నిజాంపేట్: నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో గల బండారి లే అవుట్ కాలనీ లో కోవిడ్ – 19 పోలీస్ వాలంటీర్ గా నియమించబడ్డ వారికి (75 మందికి ) మున్సిపల్ ఆఫీస్ దగ్గర ” ASR Army ” వారి సౌజన్యంతో T shirt లు పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో మేయర్ కొలన్ నీల గోపాల్ రెడ్డి, 32 వ డివిజన్ కార్పోరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి, 27 వ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి జ్యోతి నరసింహ రెడ్డి, బండారి లే అవుట్ సంక్షేమ సంఘ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, బాచుపల్లి CI ￰జగదీశ్వర, SI వేణు మాధవ్, మరియు ASR Army సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏనుగుల శ్రీనివాసరెడ్డి వాలంటీర్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ వాలంటీర్స్ వారికి అప్పచెప్పిన బాధ్యతలు త్రికరణ శుద్ధిగా నిర్వహించాలని, నిత్యం పోలీసులతో అనుసంధానం చేసుకుంటు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, ప్రజల పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా దురుసుగా ప్రవర్తించకూడదని, మన ముఖ్యమంత్రి KCR ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here