Home తెలంగాణ పోలీస్‌ అమరుల త్యాగం వృథా కావొద్దు…

పోలీస్‌ అమరుల త్యాగం వృథా కావొద్దు…

531
0
CP Satyanarayana speaking at the martyrs' memorial function
CP Satyanarayana speaking at the martyrs' memorial function

– పోలిసుల త్యాగం అజరామరం
– అమరుల ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలి
– రామగంఉడం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 21: శాంతిభత్రల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగం వృథా కావొద్దని, పోలీసు అమరవీరుల ఆశయాల సాధనకు, వారి స్ఫూర్తితో ప్రజా సేవలో ముందుకు సాగాలని రామగుండం సిపి సత్యనారాయణ పేర్కొన్నారు.

బుధవారం రామగుండం కమిషనరేట్‌ రామగుండం కమిషనరేట్‌ ఆర్ముడ్‌ రిజర్వ్డ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో ఏర్పాటుచేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలిస్‌ గౌరవందనం స్వీకరించి అమరవీరుల స్థూపము వద్ద కాగడాను వెలిగించి,  పుష్పగుచ్ఛము ఉంచి నివాళులు అర్పించారు.

CP Satyanarayana paying homage to the martyrs
CP Satyanarayana paying homage to the martyrs

ఈ సందర్భంగా సిపి నత్యనారాయనణ మాట్లాడుతూ అక్టోబర్‌ 21, 1959 సంవత్సరంలో 20 మంది జవాన్లు కలసి లడక్‌ ప్రాంతంలో హాట్‌ స్ట్రింగ్‌ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చింది. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్‌ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందని తెలిపారు. అమరు లైన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు, ప్రజల రక్షణకు పునరంకితం కావాలన్నారు.

CP Satyanarayana lighting the torch at the Martyrs' Stupam
CP Satyanarayana lighting the torch at the Martyrs’ Stupam

ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విఛ్ఛిన్న కర శక్తులతో నేరాలకు, ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించిదని తెలిపారు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమేనని పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనేనని, అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారన్నారు.

Salute to the martyrs
Salute to the martyrs

ధనవంతులు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనేనని తెలిపారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది, శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యమన్నారు. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారని తెలిపారు.

Police officers and families of martyrs participating in the martyrs' memorial service
Police officers and families of martyrs participating in the martyrs’ memorial service

సంవత్సర కాలంలో మన దేశంలో విధి నిర్వహణలో 264 మంది వీరమరణం పొందారని, వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాలను ఆదుకోవడం, ఆ కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

Tribute to the families of the martyrs ...
Tribute to the families of the martyrs …

పోలీసులు చేస్తున్న అత్తున్యత త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా కమీషనరేట్‌ నందు ఈరోజు రోజు నుండి అక్టోబర్‌ 31 వరకు పోలీసు స్టేషన్‌ లలో ఓపెన్‌ హౌజ్‌ కార్య క్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అమరుల కుటుంబాల ఆదుకుంటామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు.

CP Satyanarayana presented mementos to the families of the martyrs

కార్యక్రమంలో డిసిపి అడ్మిన్‌ అశోక్‌ కుమార్‌, ఏఆర్‌ అడిషనల్‌ డిసిపి సంజీవ్‌ ,ఎసిపి లు,ఉమేందర్‌, ఏసీపీ ఏఆర్‌ సుందర్‌ రావు, ఇన్స్పెక్టర్స్‌, సబ్‌ఇన్స్పెక్టర్స్‌, రిజర్వడ్‌ ఇన్స్పెక్టర్స్‌, ఎఆర్‌, సివిల్‌ పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here