– నగర కమిషనర్, ఆర్జీవన్ జియం లకు వినతి పత్రాలు
– సానుకూలంగా స్పందించిన నగర కమిషనర్ ఉదయ్ కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మార్చి 26ః ఆత్మహత్యా ప్రయత్నాలను నివారించేందుకు గోదావరి బ్రిడ్జి రేలింగ్‌పై పెన్సింగ్ ఏర్పాటు చేయాలని రామగుండం మునిసిపల్ నగర కమిషనర్ పి.ఉదయ్ కుమార్, గోదావరిఖని అర్జీ వన్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ లను ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం రోజున వినతి పత్రం సమర్పించారు.
అనంతరం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మద్దెల దినేష్ మాట్లాడుతూ గోదావరి బ్రిడ్జిపై ఇరు వైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాల నుండి పోరాడుతున్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో ఆత్మహత్య ప్రయత్నాలు పెరిగిపోతున్న విషయం అందరికి తేలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతో గోదావరిఖని లోని బ్రిడ్జి వద్ద గోదావరి నది నిండు కుండలా మారి ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. దురదృష్టశాత్తూ నేడు ఆత్మహత్యలు చేసుకోవడానికి నిలయంగా మారడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహ్లదకరంగా ఉండాల్సిన బ్రిడ్జి ఆత్మ హత్యలకు కేంద్రంగా మారి బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. వారం రోజుల వ్యవధిలో పదిమంది దాకా ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడం బాధాకరమని అన్నారు.
స్థానిక ప్రజలు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటుంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పేరుగాంచిన పారిశ్రామిక ప్రాంతమయినప్పటికీ ఏ ఒక్క సంస్థ కూడా పెన్షింగ్ ఏర్పాటుకు స్పందించక పోవడం శోచనీయమన్నారు. సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసి, ఆర్ఎఫసిఎల్, నగర పాలక సంస్థ వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు రక్షణగా గోదావరి బ్రిడ్జిపై సింగరేణి యాజమాన్యం, నగర పాలక సంస్థ నేతృత్వంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.
రామగుండం నగర కమిషనర్ ఉదయ్ కుమార్ ఐఏఎస్ సానుకూలంగా స్పందించి పెన్షింగ్ ఏర్పాటు రెండు, మూడు నెలల్లో పెన్షింగ్ ఏర్పాటు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు గడప శ్రీకాంత్, మాదిరెడ్డి నాగారాజ్, సిహెచ్ వివేక్, కొమ్మ చందు, మండల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.