– ప్రజలందరూ కెసిఆర్ వైపే
– టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
– కుల వృత్తులకు పెద్దపీట
– గడపగడపకు గులాభీ సైన్యం…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హాలియా (నాగార్జునసాగర్), మార్చి 26ః నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకనేనని రామగుండం ఎమ్మెల్యే, టిఆర్ఎస్ హాలియా ఇంచార్జి కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం హలియాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలంతా కేసిఆర్ పాలనపై విశ్వాసంతో వున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు.
గత ఇరవై రోజులుగా హలియా పట్టణంలో ప్రచార కార్యక్రమంలో పర్యటించిన సందర్భల్లో ప్రజలంతా కేసీఆర్‌ను పూర్తి స్దాయులో విశ్వసిస్తున్నారన్నారు. ముఖ్యంగా వృద్దులు, వికలాంగులు, ఓంటరి మహీళలు తమ దైవంగా కొలుస్తున్నారన్నారని తెలిపారు.
అంతకు ముందు హలియా పట్టణంలోని 8వ వార్డులో గడపగడపకు గులాబీ సైనికులు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం వచ్చాక కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నా రన్నారు. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్నవారికి భరోసగా అర్దిక పరిపుష్టత పెంపోందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గొల్లకుర్మ సోదరులకు సబ్సిడీలపై గొర్రె లను అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పార్వతమ్మ శంకరయ్య రాష్ట్ర నాయకులు మలిగి రెడ్డి లింగారెడ్డి, వార్డు కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, ఇంచార్జి పాముకుంట్ల భాస్కర్ అధిక సంఖ్యలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.