(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 19: సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని పవర్‌హౌస్‌కాలనీ, ఐ.బి కాలనీ, గాంధీనగర్, తిలక్‌నగర్ ఏరియాలోని ఖాళీ క్వార్టర్ లను శనివారం సింగరేణి అధికారులు పరిశీలించారు. ఖాళీలుగా ఉన్న క్వార్టర్లను ఉద్యోగులకు కేటాయించడం కోసం కనీస సదుపాయాలు, క్వార్టర్ల ప్రక్కన షెడ్ల నిర్మాణం, షాపులు కట్టిన వాటి గురించి ఎస్‌ఓటు జియం త్యాగరాజు, ఉన్నతాధికారుల కమిటీ బృందం క్వార్టర్ లను సందర్శించారు.
ఇప్పటి వరకు ఉండి రిటైర్‌మెంట్, లేదా మెడికల్ అన్ ఫిట్ అయి ఖాళీలుగా ఉన్న క్వార్టర్‌లలో ఎవరైన ప్రక్కన వేసిన షెడ్ల లేదా నిర్మాణం చేసినచో వాటిని యదా విధిగా కంపెనీకి అప్పజెప్పాలని అట్టి వాటిని కౌన్సిలింగ్‌లో ఉద్యోగులకు అలాట్ మెంట్ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రమేష్, ఎస్టేట్ అధికారి సాంబశివరావు, డిప్యూటి పర్సనల్ మేనేజర్ గంగాధర్, సెక్యూరిటీ అధికారి వీరా రెడ్డి, క్వార్టర్ సెక్షన్ సిబ్బంది బోస్, సదానందం తదితరులు పాల్గొన్నారు.