Home తెలంగాణ  జిల్లాలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని పర్యటన

 జిల్లాలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని పర్యటన

726
0
Minister visit
State Animal Husbandry Minister Talasani Srinivas Yadav visit Peddapalli District

– ఓఎస్‌డీ జి.కళ్యాణ్‌ కుమార్‌

(ప్రజాలక్ష్యం పత్రినిధి)
పెద్దపల్లి, సెప్టెంబర్‌ 19: రాష్ట్ర పశుసంవర్థక శాఖ, సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారని మంత్రి ఓఎస్డి జి.కళ్యాణ్‌ కుమార్‌ తెలిపారు. మంత్రి తలసాని ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి కరీంనగర్‌లోని మంత్రి నివాసానికి చేరుకుంటారు. టిఫిన్‌ చేసిన అనంతరం ఉదయం 10.10 నిమిషాలకు అంతర్గాం మండలంలోని కుందనపల్లి గ్రామానికి చేరుకుంటారు.

అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామంలో నిర్మించే జిల్లా గొర్రెలు, మేకల మార్కెట్‌ యార్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. గ్రామంలో పిపిఆర్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభిస్తారు. మేత పంపిణీ, క్రాఫ్‌ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.10 నిమిషాలకు కుందనపల్లి నుండి బయలుదేరి గోదావరిఖని చేరుకుంటారు.

గోదావరిఖనిలో ఉదయం11.25 నిమిషాలకు సమక్క-సారక్క జాతర ఘాట్‌ వద్ద సుందిళ్ల బ్యారేజి బ్యాక్‌ వాటర్‌లో చేపల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌ బయలుదేరు తారని తెలిపారు.

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

official examine
Officials examining market yard arrangements

పెద్దపెల్లి జిల్లా రామగుండం శివారులోని అంతర్గం మండలం కుందనపల్లి గ్రామం వద్ద మార్కెట్‌ యార్డ్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఆదివారం మార్కెట్‌ యార్డ్‌ ప్రారంభోత్సవానికి తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యటనను దష్టిలో పెట్టుకుని పెద్దపల్లి జిల్లా ఆర్డిఓ శంకర్‌ కుమార్‌, పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజన్న తదితరులు మార్కెట్‌ యార్డ్‌ ప్రారంభోత్సవ స్థలాన్ని, వేదిక ఏర్పాటు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మారం తిరుపతి, ఉపాధ్యక్షులు గుంపుల ఓదెలుయాదవ్‌, నాయకులు మేకల నర్సయ్య పాలకుర్తి మండలం, మేకల పోషం అంతర్గాం మండలం, కొత్తపల్లి సర్పంచ్‌ మల్లెత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here