Home తెలంగాణ కరోన నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఆర్జీవన్ జిఎం కె.నారాయణ

కరోన నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఆర్జీవన్ జిఎం కె.నారాయణ

567
0
Masks Distribution
Masks distribution by RG-I GM K. Narayana

(ప్రజాలక్ష్యం ప్రతినిధి – గోదావరిఖని)
కరోన నివారణకు అన్ని గనులపై మరింతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆర్జీవన్ జియం కె.నారాయణ తెలిపారు. కరోనా నివారణకు చేపట్టిన చర్యలను పర్యవేక్షించటంలో భాగంగా జీడికే 11 ఇంక్లయిన్ గనిని జియం సందర్శించారు. ఈ సందర్బంగా జియం మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అర్జీ-1 ఏరియాలో అన్ని గనులు మరియు డిపార్ట్ మెంట్లలో సానిటైజర్ లు, మాస్కులు, హైపో క్లోరైడ్ ద్రావణం, థర్మల్ స్కానర్స్, పల్స్ అక్సోమీటర్లు, హ్యాండ్ వాష్ లు అందుభాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు అర్జీ-1 ఏరియా లో 23,000 వేల మాస్కులను ఉద్యోగులకు పంపిణీ చేసామన్నారు. అదే విధంగా గనుల ఉపరితల ప్రదేశాలతో పాటు అండర్ గ్రౌండు పని స్థలాలలో కూడా హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచ్చికారి చేపించటం జరుగుతుందన్నారు. ఉధ్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చుకు వెనుకాడకుండా ఆస్ట్రేలియా దేశం నుండి రేస్ మేడ్ కంపెనీ తయారు చేసిన 6 లక్షల విలువైన 2 నూతన కృత్రిమ వెంటిలెటర్స్ ను కరోనా వ్యాది గ్రస్తుల కోసం ఏరియాహాస్పిటల్ లో ఏర్పాటు చేశామన్నారు. కరోనా సోకిన వారికి స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్ నందు అన్ని రకాల ఏర్పాట్లను చేశామని తెలిపారు. ప్రతి రోజు కరోనా పరీక్షలను చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా పరీక్షలను చేయించుకోవాలని తెలిపారు. అనుమానం ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా తమ విధులకు దూరంగా ఉండాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వారికి ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ అయి తగు ట్రీట్ మెంట్ తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కూలు దరించాలని, స్వీయ రక్షణ చర్యలను తప్పని సరిగా పాటించాలని కోరారు. కరోనా కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను ఉద్యోగులకు వివరించారు. ఉద్యోగులు అదైర్యపడవద్దని, కరోనా కట్టడికి చేపట్టవలసిన అన్నీ జాగ్రత్త చర్యలను మరియు నివారణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని జియం తెలిపారు. అదే విధంగా ట్రాక్టర్ స్ప్రెయింగ్ మిషన్ తో గని మొత్తం హైపోక్లోరైడ్ ద్రావణంతో మ్యాన్ వే, ల్పాంపు రూమ్, ఉద్యోగుల డిస్ట్రిబ్యూషన్ పాయింట్, మిషన్ లకు పిచ్చికారి చేపించటం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గని ఉధ్యోగులకు మాస్కులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, ఏజెంట్ సురేశ్, గని మేనేజర్ నేహ్రూ, పర్సనల్ మేనేజర్ రమేశ్, ఫిట్ సెక్రటరీ నాయిని శంకర్, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, సంక్షేమాధికారి రవీందర్ ఉధ్యోగులు పాల్గొన్నారు.

GM Speaking
RG-I GM speaking to Singareni Employees

జీడికే 2 ఇంక్లైన్ లో కరోనా నివారణ చర్యలను పర్యవేక్షించిన అర్జీ-1 జియం

కరోనా నివారణకు చేపట్టిన చర్యలను పర్యవేక్షించటంలో భాగంగా రామగుండం ఏరియా -1 జీడికే 2&2a ఇంక్లైన్ గనిని ఆర్జీవన్ జియం కె.నారయణ సందర్శించారు. ఈ సందర్బంగా జియం  మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ లో ప్రతి రోజు కరోనా పరీక్షలను చేస్తున్నామని ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా పరీక్షలను కోరారు. అనుమానం ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా తమ విదులకు దూరం గా ఉండాలని విజ్ఞప్తి చేసారు.  ప్రతి ఒక్కరూ మాస్కులు  దరించి, స్వీయ రక్షణ చర్యలను తప్పని సరిగా పాటించాలన్నారు. ఉద్యోగులు అదైర్యపడవద్దని, కరోనా కట్టడికి చేపట్టవలసిన అన్నీ జాగ్రత్త చర్యలను మరియు నివారణ ఏర్పాట్లను చేసామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టి.బి.జి.కె.ఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, ఏజెంట్ సురేశ్, సిఎంఒఎఐ జనరల్ సెక్రటరీ సురేశ్ , గని మేనేజర్ సాయి ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రమేశ్, ఫిట్ సెక్రటరీ లక్ష్మణ్, సంక్షేమాధికారి కిరణ్ కుమార్ ఉధ్యోగులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here