– ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు గడపగడపకు తీసుకువెళ్లాలి
– పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పట్టణ కమిటిలు
– కార్యకర్తలను కంటికి రెప్పాలాగా కాపాకుటుంది తెరాస పార్టీ
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
ఆగష్టు 30: తెలంగాణ సంక్షేమమే పరమాధిగా ప్రజలకు కొండంత అండగా సిఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. అదివారం 8వ కాలనీలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విసృతస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సమితి బలోపేతమే మనందరి లక్ష్యం కావాలన్నారు. తెలంగాణ ఉద్యమలో ఏ విధంగా అయితే అలుపెరగని పోరాటం చేశామో అదే తరహాలో ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించడంలో అంతే కృషి చేసి బంగారు తెలంగాణ సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని చందర్ పిలుపునిచ్చారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా ప్రతి కార్యకర్త పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల కళ్లలో అనందం నింపేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ జల ప్రధాత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బిజేపి పార్టీలు ఓట్ల సమయంలో మాత్రమే ప్రజల మధ్యకు వస్తారని ఎలక్షన్ కాగానే మళ్లీ కనిపించే పరిస్థితి ఉండదని, తెరాస పార్టీ నిత్యం ప్రజల కోసం పాటుపడుతుందన్నారు. రామగుండం నియోజవర్గంలో తాము ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి 16 గంటలు ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెరాస కార్యకర్తలు సైనికుల వలే కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తను తెలంగాణ రాష్ర్ట సమితి కంటికి రెప్పలా కాపాడుకుటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
8వ కాలనీ పట్టణ కమిటి ఎన్నికః
పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా 8వ కాలనీ పట్జణ కమిటి నియామకం జరిగింది. పట్టణ అధ్యక్షులు దుర్గం రాజేశ్, యువజన విభాగం అధ్యక్షులుగా సారయ్య నాయక్, మహిళ విభాగం అధ్యక్షులరాలుగా బైరం మణిలను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు సాగంటి శంకర్, శంకర్ నాయక్, బాదే అంజలి భూమయ్య, నాయకులు అయిలి శ్రీనివాస్, తోడేటి శంకర్ గౌడ్, కుమర్ నాయక్ సంధ్యారాణి, మాల్లారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.