Home తెలంగాణ గని ప్రమాదాల నివారణకు పట్టిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలి

గని ప్రమాదాల నివారణకు పట్టిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలి

472
0
RG-I GM K.Narayana speaking at safety committee meeding
RG-I GM K.Narayana speaking at safety committee meeding

-ఆర్జీవన్‌ జియం కల్వల నారాయణ

(ప్రజాలక్ష్యం కోల్‌బెల్ట్‌ ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్‌ 13: గని ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్జీవన్‌ జియం కల్వల నారాయణ తెలిపారు. సింగరేణి ఆర్‌జీ-1 పరిధి జిడికే.11వ ఇంక్లయిన్‌ సేఫ్టీ కమిటీ సమావేశం సోమవారం జరిగింది.

సమావేశంలో ఆర్జీవన్‌ జనరల్‌ మేనేజర్‌ కల్వల నారాయణ మాట్లాడుతూ భూగర్బ గనిలో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సేఫ్టీ కమిటీ సభ్యులతో సమీక్షించారు. భూగర్బ గనిలో రక్షణ చర్యలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్షణ సూత్రాలను విధిగా పాటిస్తూ విధులు నిర్వహించాలని జీఎం కోరారు.

గతంలో భూగర్బ గనిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదాలకు గురైన వారితో జీఎం నారాయణ ఫోన్‌ చేసి తెలుసుకున్నారు వారి స్థితిగతులను తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ కె.వి.రావు, ఏజెంట్‌ మనోహర్‌, అక్టింగ్‌ మేనేజర్‌ సురేష్‌, గ్రూప్‌ ఇంజనీరు రామ్‌ దాస్‌, సంక్షేమాధికారి రవీందర్‌, వర్క్‌మెన్‌ ఇన్స్పెక్టర్‌, పిట్‌ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here