(ప్రజాలక్ష్యం కోల్‌బెల్ట్ ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 13,సింగరేణి ఆర్‌జీ-3 పరిధి సెంటినరికాలనీలో నిర్మిస్తున్న సౌర విద్యుత్ ప్లాంటును జీఎం కె.సూర్యనారాయణ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా విద్యుత్ కేంద్రం అభివృద్ధి పనులు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు అభివృద్ధి పనులు పరిశీ లించారు. ఇచ్చిన గడువులోగా ప్లాంటు నిర్మాణ పనులు పూర్తి చేయాలని జీఎం ఆదేశించారు. రక్షణతో కూడిన పనులు చేపట్టాలని సూచించారు. 35 మెగావాట్ల సౌర విద్యుత్ అభివృద్ధి పనులు ఈ నెల 23వ తేదీలోగా నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.
ఆయన వెంట ఏరియా ఇంజనీర్ రామలింగం, ఏరియా సర్వే ఆఫీసర్ కె.రమేశ్, డీజీయం (సివిల్) డి.శ్రీనివాసులు, ఎస్.ఈ. చంద్రశేఖర్, ఇతర అధికారులు, బీహెచ్‌ఈఎల్, సెకి కంపెనీల ఇంచార్జీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.