(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఆగష్ట 28: ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. శుక్రవారం గుంటూరుపల్లి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్త శివారెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. కుటంబ సభ్యులను ఓదార్చారు. శివారెడ్డి కుటంబానికి అన్ని విధాలుగా అసరాగా నిలుస్తామన్నారు.
శివారెడ్డి కుటుంబానికి లక్ష అర్దిక సహాయం అందించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
పాలకుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శివారెడ్డి కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒక లక్ష రూపాయల అర్దిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ శివారెడ్డి కుటుంబాన్ని ఎల్లవేళల ఆదుకుంటూ వారి కుటుంబానికి మరింతగా సహాయ సహాకారాలు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్ పాముకుంట్ల భాస్కర్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బోమ్మగాని తిరుపతి గౌడ్, గోపగాని మోహన్ గౌడ్, పల్లె శ్రీనివాస్ యాదవ్, నీలరపు రవి తదితరులు పాల్గొన్నారు.