Home తెలంగాణ కులవ్రుత్తులకు ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

కులవ్రుత్తులకు ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

503
0
Ministers visit
Ramagundam MLA Korukanti Chandar speaking ministers visit

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 19: తెలంగాణ రాష్ట్రంలోని కులవ్రుత్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తు వారికి ఆర్ధిక భరోసా కల్పిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. శనివారం రాష్ట్ర పశు సంవర్ధక, మత్యశాఖ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి  కోప్పుల ఈశ్వర్‌ రామగుండం నియోజవర్గంలో పర్యటించనున్న నేపద్యంలో సమ్మక్క సారలయ్మ గద్దెల వద్ద గోదావరినది తీరంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులవ్రుత్తులకు పెద్దపీట వేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద గొర్రెల, మేకల మార్కెట్‌ శంకుస్థాపన కార్యక్రమంతో పాటు గోదావరినదిలో చేపల విడుదల కార్యక్రమానికి పశుసంవర్ధక, మత్యశాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్‌ హజరవుతున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుందిల్ల బ్యారెజ్‌ కు 11లక్షల 41 వేల చేపపిల్లలు మాంజూరు కాగా, అదివారం మంత్రులు 2లక్షల చేప పిల్లలను గోదావరినదిలోకి వదలడం జరగుతుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వెంట నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌ రావు, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్‌, దాతు శ్రీనివాస్‌,సాగంటి శంకర్‌, అడ్డాల గట్టయ్య, మేకల సదానందం, పాముకుంట్లభాస్కర్‌, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, రఫీక్‌, జహీద్‌ పాషా, తోడేటి శంకర్‌ గౌడ్‌, దుర్గం రాజేష్‌, అచ్చె వేణు, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్‌ తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here