– సిఎం కేసీఆర్ పాలన పట్ల పూర్తి విశ్వాసం
– ఆదర్శ కార్పోరేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 22: రామగుండం కార్పోరేషన్ కోఆప్షన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం రామగుండం కార్పోరేషన్ కార్యాలయంలో జరిగిన కో ఆప్షన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులు తానిపార్తి విజయలక్ష్మి, చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్లీమభాను, మహ్మద్ రఫీలు కోఆప్షన్ సభ్యులుగా గెలుపొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ పంచాయితి నుండి పార్లమెంట్ వరకు ఏ ఎన్నికలయిన గులాభీ జెండా ఎగరడం ఖాయమని… తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శవంతంగా మారిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అంటే పూర్తి విశ్వామని, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన పూర్తి స్థాయి మోజార్టీని అందిస్తున్నరన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సిఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రామగుండం కార్పోరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పాతపెల్లి లక్ష్మి-ఎల్లయ్య, అడ్డాల స్వరూప-రామస్వామి, కుమ్మరి శ్రీనివాస్, బోడ్డు రజిత-రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి-భూమయ్య, కాల్వ స్వరూప-శ్రీనివాస్, వెగోలపు రమాదేవి-శ్రీనివాస్, దాతు శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, ర్యాకం శ్రీమతి-వేణు, సాంగటి శంకర్, శంకర్ నాయక్, తాళ్ల అమృతమ్మ-రాజయ్య, నీల పద్మ-గణేష్, బాదె అంజలి- భూమయ్య, కన్నూరి సతీష్ కుమార్, ఎన్.వి.రమణరెడ్డి, అఫ్రీన్ పాతిమా-సలీం, మంచికట్ల దయాకర్, ఇంజపూరి పులిందర్, అయిత శివకుమార్, దొంత శ్రీనివాస్, కోమ్ము వేణుగోపాల్, జెట్టి జ్యోతి – రమేష్, జంగపల్లి సరోజన- కనుకయ్య, జంజర్ల మౌనిక-రాజు, పాముకుంట్ల భాస్కర్, బాల రాజ్ కుమార్, మేకల సదానందం, ధరణి స్వరూప-జలపతి, పోన్నం విద్య-లక్ష్మన్, గనముక్కుల మహలక్ష్మి-తిరుపతి తదితరులున్నారు.