– ప్రజల ఆవస్థలను తొలగించేందుకు నూతనంగా రోడ్లు, డ్రైనేజీలు
– కార్పోరేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 1: రామగుండం కార్పోరేషను సుందరంగా మార్చాలన్న సంకల్పంతో పాలన సాగిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం కార్పోరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
5 కోట్ల 60 లక్షలతో ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డునుండి ఆర్‌ఎఫ్ సిఎల్ వరకు 4 లైన్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షకాలంలో ప్రజల ప్రయాణ అనేక అవస్థలు పడ్డారని, వారి అవస్ధలను తొలగించే విధంగా నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల సమస్యల పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ జెట్టి జ్యోతి-రమేష్, నాయకులు అడ్డాల రామస్వామి, నవిన కుమార్, గోలివాడ ప్రసన్న, భద్రయ్య, ఇరుగురాళ్ల శ్రావన్,మేకల అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలేని రామగుండం తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం
గురువారం కార్పోరేషన్ పరిధిలో 2,3వ డివిజన్‌లో జరిగిన మరో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 15 లక్షల వ్యయంతో అండర్ గ్రౌడ్ డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి వర్యులు కేటిఆర్ ప్రజలకు మౌళిక వసతులు కల్పనకు నిధులను కేటాయించి ప్రజల ఇబ్బందులను తొలగించారన్నారు.
గతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో డివిజన్ సమస్యలు తమ దష్టికి తీసుకురావడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కరానికి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రామగుండం కార్పోరేషను అభివద్ధి పధంలోకి తీసుకువెళ్లేందుకు నిత్యం శ్రమిస్తున్నా మన్నారు. సమస్యలు లేని రామగుండంగా తీర్చిద్దిడ్డమే మా ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ఎన్.వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, కల్లచర్ల కష్ణవేణి-భూమయ్య, నాయకులు అడ్డాల రామస్వామి,జే.వి.రాజు, కుమ్మరి శారదా, ఈదూనూరి పర్వతాలు, శంకర్, ముప్పు సురేష్, గోలివాడ చంద్రకళ, గోలివాడ ప్రసన్న, ఇరుగురాళ్ల శ్రావన్, మేకల అబ్బాస్, సాగర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.