– ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి
– గడపగడపకూ కేసిఆర్ సంక్షేమ ఫలాలు
– ఇంటింటికి చందర్ పాదయాత్ర
– జనగామలో ఇల్లిల్లు తిరిగిన ఎమ్మెల్యే చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి ` గోదావరిఖని)
తన దగ్గరికొచ్చి సమస్య చెప్పుకొంటే కాదు, తానే స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వీలైతే అధికారులతో అక్కడే మాట్లాడి సమస్యలను పరిష్కరించడం ఆయన నైజం. రోజుకు కనీసం 16 గంటలు ప్రజాక్షేత్రంలోనే ఉండడం ఆయన అలవాటు. అందుకోసం పల్లెనిద్ర, బస్తీ బాట, గడపగడపకు సందర్శన పేరిట ఎన్నో కార్యక్రమాలు రూపొందించి, నిత్యం ప్రజల మధ్యనే ఉంటుంటారు… ఆయనే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
ఫిబ్రవరి, 2: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయో తెలుసుకునే లక్ష్యంతో గురువారం నుండి ‘గడపగడపకు కేసిఆర్ సంక్షేమ ఫలాలు..ఇంటింటికి చందరన్న పాదయాత్ర’ మొదలుపెట్టారు ఎమ్మెల్యే చందర్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ పరిధి జనగామలో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు గ్రామస్తులతోనే మాట్లాడుతూ గడిపారు. అయ్యప్ప దీక్ష కారణంగా కటిక నేలపైనే అక్కడే పడుకొన్నారు. తెల్లవారు జనగామలోని అతి పురాతన ప్రసిద్ధ ఆలయం శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం పాదయాత్రతో ఇల్లిల్లూ తిరిగారు.
కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏ మేరకు అందాయో ప్రజలను కనుక్కున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం దిశగా అప్పటికప్పుడుగా సంబంధిత అధికారులతో ఫోన్లోనే చర్చించారు. ఆదేశాలు జారీ చేశారు. గత వర్షాకాలం వరద ముంపుకు గురైన ఎస్సీ కాలనీ సందర్శించారు. గోదావరి వరద నీటితో తమ పంట పొలాలు దెబ్బతిన్నాయని పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా, జనగామ నుండి మల్కాపూర్ వరకు గోదావరి నది ఒడ్డున సింగరేణి నిధులతో కరకట్ట నిర్మింపజేయడం కోసం కృషి చేస్తానన్నారు. అలాగే వరద నీటితో దెబ్బతిన్న స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు, కూలిపోయిన కల్వర్టును పరిశీలించారు. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి తిరిగి పునర్నిర్మింపజేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
పురుగుపట్టి, తెగులు సోకి దెబ్బతిన్న ఊషాలు, లక్ష్మయ్యలకు సంబంధించిన 17 ఎకరాల పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా తగిన నష్టపరిహారం అందే విధంగా చూస్తానన్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. వారిక వసరమైన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ నిర్మాణం చేయిస్తానని, బోర్వెల్ వేయిస్తానన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బందెల నర్సింహులును పరామర్శించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, చికిత్స అవసరమైన ననుమాల అశోక్ కు లక్షా 50 వేల రూపాయల ఎల్వోసీ చెక్ ను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ప్రజారంజకమైన పాలననం దిస్తున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఆ లక్ష్య సాధనకై, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరువయ్యేలా పల్లెనిద్ర, ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. కాగా క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకోవడానికి తమ గ్రామానికే విచ్చేసిన ఎమ్మెల్యే చందర్ కు గ్రామ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. ఏ ఇంటికి వెళ్లినా ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి రావడం పట్ల సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన వెంట కార్పొరేటర్లు జనగామ కవితా సరోజిని, ధాతు శ్రీనివాస్, సాగంటి శంకర్, ఇంజపురి పులేందర్, జెడ్పిటిసి అముల నారాయణ, మాజీ కార్పొరేటర్ జనగామ నర్సయ్య, నాయకులు, గ్రామ ప్రజలు చంద్రయ్య, తోకల రమేష్, గంగా శ్రీనివాస్, అడబత్తుల మల్లేష్, శ్రీనివాస్, కలవేన రవీందర్, బొడ్డు చంద్రయ్య, మల్యాల రమేష్, పులి రాయమల్లు, డాక్టర్ చక్రపాణి, అమర్, నారాయణదాసు మారుతి, కేశవ గౌడ్, పర్లపల్లి రవి, విజయ్ కుమార్, జడ్సన్, దాసరి శ్రీనివాస్, వీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.