ప్రభుత్వానికి చిన్న, మధ్యతరహా దినపత్రిలు, మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు అల్టిమేటం…
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 12ః చిన్న పత్రికలు, జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని యెడల మునుగోడు ఉప ఎన్నిక వేదికగా ప్రభుత్వం అనుసరిస్తుసన వివక్షతను ప్రజల్లోకి తీసుకెలతామని చిన్న, మధ్యతరహా దినపత్రిలు, మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు హెచ్చ రించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా యూసుఫ్‌బాబు మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రాంతీయ దినపత్రికలు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని ఆరోపించారు. అప్పు డప్పుడు కొన్ని రాయితీలు ఇచ్చినట్లు ఇచ్చి ఏదో ఒక రకంగా పత్రికల, ఛానళ్ల పీకనొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. సమాచార శాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, జర్నలిస్టుల సమస్యలను చూస్తున్న ఐటీ శాఖ మంత్రిని కేటీఆర్‌కు పలు సందర్భాల్లో విన్న వించినా ప్రాంతీయ దిన పత్రికల సమస్యలు పరిష్కారం కాలేదు కదా అధికమయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేని ప్రతికలను, చానల్ లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ ల ఆదేశాలు కూడా అమలు కావడంలేదని విచారం వ్యక్తం చేసారు. 20 వేలమంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చామని, దేశంలో ఎక్కడా ఇన్ని అక్రిడేషన్లు ఇవ్వలేదని చెపుతున్నారేకానీ అర్హులైన అనేకమంది జర్నలిస్టులు అక్రిడేషన్లు పొందలేకపోతురన్నారని తెలిపారు. అక్రిడేషన్ల సంఖ్య పెరిగింది కానీ గత మూడేళ్ళుగా హెల్త్ కార్డులు పనిచేయడంలేదని యూసుఫ్ బాబు చెప్పారు. జర్న లిస్టుల సంక్షేమం కోసం100 కోట్లు మీడియా అకాడమీకి ఇచ్చామని గత 7 సంవత్సరాలుగా ముఖ్య మంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పదేపదే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు 50 కోట్లు దాటలేదని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల గురించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ విన్నవిస్తే, పలుసార్లు హామీలు ఇచ్చినా, కోర్టు తీర్పు వచ్చినా కదలికలేద ని ఆయన ఆరోపించారు.
ఈనెల 15 వ తేదీ లోపల సమస్యలన్నీ పరిష్కరిస్తున్నట్లు సరైన హామీ ఇవ్వకపోతే మునుగోడు ఎన్నిక వేదికగా పత్రికలు, జర్నలిస్టులపై అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. కొన్ని సమస్యలు పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చినా, సమాచార శాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించినా, సమాచార శాఖలో పాతుకుపోయిన కొంతమంది అధికారులు ప్రభుత్వానికి ప్రాంతీయ పత్రికలకు, జర్నలిస్టులకు, మీడియాకు మధ్య సైoధవ పాత్ర పోషించి సమస్యను జఠిలం చేస్తున్నారని యూసుఫ్ బాబు ఆరోపించారు.
సమస్యలన్నింటికి మూలకారమైన ఎంప్యానల్మెంట్ కు సంబంధించిన జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. గత మూడు సంవత్సరాల కాలంలో కరోనా విధుల నిర్వహణలో, రోడ్డు ప్రమాదాల్లో, కరోనాతో మరణించిన చిన్న పత్రికల సంపాదకుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, వారందరికీ ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టుల్లో 90 శాతం మంది కుల, మతాలకు అతీతంగా యాజమాన్యాల నుండి సరైన వేతనాలులేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని వారికి “జర్నలిస్టు బంధు” ను ప్రకటించాలని యూసుఫ్ బాబు కోరారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు దయానంద్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, డిప్యూటీ కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజంఖాన్, నాయకులు, ప్రాంతీయ దినపత్రిల ఎడిటర్లు వెంకటయ్య, జాన్ షాహిద్, మాధవరెడ్డి, మొహమ్మద్ ఖాసీం, అమన్, మొహిసిన్ అలీ, రియాసత్, రాము తదితరులు పాల్గొన్నారు.