– టీఎస్ బిపాస్ ద్వారా అన్ని రకాల అనుమతులు
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలనను యావత్ దేశం అనుసరిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో టీఎస్ బిపాస్ విధానంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో టిఎస్ బిపాస్ విధానంతో చాలా సులభమైన పద్దతిలో పారదర్శకంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని రకాల అనుమతులను పొందవచ్చునని తెలిపారు.
పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించాలనే సదుద్దేశంతో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రవేశపెట్టారని ఈ యాక్టుకు అనుగుణంగా టీఎస్ బిపాస్ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. నిర్ణీత సమయంలో భవన నిర్మాణం యొక్క అనుమతిని పొందవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనకు సులభమైన పద్ధతిలో అనుమతుల కోసం దేశంలో ఎక్కడలేని విధంగా టీఎస్ ఐపాస్ తరహాలో ప్రవేశపెట్టిన మరో విప్లవాత్మ కమైన చట్టం టీఎస్ బిపాస్ అని అన్నారు. ముఖ్యంగా 75 చదరపు గజల లోపు వ్యక్తిగత నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం 1 రూపై టోకన్ ఫీజ్ పెట్టడం, అలాగే 63 చదరపు మీటర్ల నుండి 200 చదరపు మీటర్ల వరకు వ్యక్తిగత నివాస భవనాలకు తనిఖి లేకుండా ఆన్ లైన్లో తక్షణ అనుమతి ఇవ్వడమనేది పేద ప్రజలకు ఒక వరం లాంటిందన్నారు.
టీఎస్ బిపాస్ వల్ల భవణ నిర్మాణ రంగానికి పెద్ద వూతం లభిస్తుందని దీని వల్ల అన్ స్కిల్డ్ సెమిస్కిల్డ్ కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అదేవిధంగా సీఎం త్వరలో చేపట్టబోయే భూమి హద్దులను అక్షంశాలు-రేఖాంశాలుతో ఫిక్స్ చేస్తామని చెప్పడం జరిగిందని. అదే రకంగా టిఎస్ బిపాస్ విధానంలో అనుమతులకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే జియో ట్యాగింగ్ చేస్తే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు, నిబంధనల ఉల్లంగనలకు తావు లేకుండా చేయవచ్చని అన్నారు.
మూసా పద్దతులను విడనాడి మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ప్రవేశపెట్టిన నూతన పంచాయితీరాజ్ చట్టం తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, ఇటీవలె ప్రవేశపెట్టిన తెలంగాణ రెవెన్యూ చట్టం, పరిపాలన సంస్కరణలంటే వట్టి మాటలు కాదు చేతల్లో చూపిస్తున్న సీఎం కేసిఆర్, కేటిఆర్ లాంటి దూరదృష్టి కలిగిన గొప్ప నాయకత్వంలో పని చేయడం మా లాంటి యువ శాసన సభ్యులం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ నాయకత్వంలో రూపొందించబడిన ప్రగతిశీల చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తుందని పూర్తి విశ్వసంతో ఉన్నానని తెలిపారు.