-11వ గని గేటు మీటింగ్‌లో వెంకట్రావు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి) :
గోదావరిఖని, సెప్టెంబర్ 24: ఆగిపోయిన మెడికల్ బోర్డును త్వరలోనే మళ్లీ ప్రారంభిం చేటట్లు చూస్తామని, కార్మికులకు లాభాల వాటా ఇప్పిస్తామని టిబిజికెఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు అన్నారు. గురువారం గోదావరిఖని 11వ గనిలో గేట్ మీటింగ్ జరిగింది. దీనికి టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు హాజరై మాట్లాడారు. గతంలో పనిచేసిన కార్మిక సంఘాలు కలరాసిన ఎన్నో కార్మికులు హక్కులను టిబిజీకేఎస్ ఆధ్వర్యంలో ఎటువంటి సమ్మెలు చేయకుండా సాధించామన్నారు.
కరోనా ప్రభావంతో ఆగిపోయిన మెడికల్ బోర్డును త్వరలోనే మళ్లీ ప్రారంభించి కారుణ్య నియామకాలు జరిగే విధంగా చూస్తామన్నారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిని కలిసి లాభాల వాటా ఇప్పిస్తామన్నారు. 190, 240 పూర్తి చేసిన బదిలీ వర్కర్స్‌ను కేవలం 1 సంవత్సర కాలంలో జనరల్ మజ్దూర్‌గా ప్రమోషన్ ఇప్పించిన ఘనత కేవలం టిబిజీకేఎస్‌కే సాధ్యమయిందని వివరించారు.
ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో టిబిజీకేఎస్ కే నాయకులు. జావేద్ పాషా, సత్యనారాయణ, వెంకటేష్, శాంసన్, కష్ణ, 11ఇంక్లైన్ పిట్ కమిటీ నాయకులు నాయిని శంకర్, సప్పిడి రామస్వామి, దుర్గం తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, దుర్గం శ్రీనివాస్, రాములు, సురేందర్, సమ్మయ్య, మల్లయ్య, పరశురాములు, ప్రతాప్, లక్ష్మయ్య, గట్టయ్య, భాస్కర్, రమేష్, చంద్రమౌళి, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.