Home తెలంగాణ పండిత దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 105వ జయంతి

పండిత దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 105వ జయంతి

482
0
Celebrating Deen Dayal Upadhyaya Birthday
BJP Leaders celebrating Deen Dayal Upadhyaya's Birthday

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 25: భారతీయ జనసంఘ్‌ అధ్యక్షులు పండిత దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 105 వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించారు. బీజేపి జనగామ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జనగామ మండల శాఖ అధ్యక్షులు తాటిపర్తి శ్రీధరరావు మాట్లాడుతూ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ భారతదేశ ఉనికికి చేసిన సేవలు మరువలేనివని, దేశ అభివద్ధి కోసం తన ప్రాణాలను సైతం వదిలిన మహామూర్తి అని కొనియాడారు. ఆయన స్థాపించిన జనసంఘ్‌ పార్టీ మహావృక్షమై 1980లో భారతీయ జనతా పార్టీగా అవతరించిందిందని తెలిపారు. బీజేపి ప్రభుత్వం మొదటగా అటల్‌ బీహార్‌ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా కొనసాగిందని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అదికారంలో కొనసాగుతూ నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత దేశ ఉనికిని తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనగామం మండల శాఖ ప్రధాన కార్యదర్శి మామిడి వీరేశం, రామగుండం కార్పొరేషన్‌ ఏరియా ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్‌, నియోజకవర్గం ఇంచార్జ్‌ మారం వెంకటేష్‌, బిజెపి నాయకులు గోగుల రవీందర్రెడ్డి, యాదగిరి, కల్వల సంజీవ్‌, మామిడి సంపత్‌, గుర్రం సురేష్‌, జనగామ సాగర్‌, గుండెబోయిన లక్ష్మణ్‌, భాషబోయిన వాసు, నక్క లక్ష్మీనారాయణ, సునీల్‌, విశ్వాస్‌, తాడికొండ నరసయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here