Home తెలంగాణ సింగరేణి సంస్థలో నూతన డైరెక్టర్ల నియామకం

సింగరేణి సంస్థలో నూతన డైరెక్టర్ల నియామకం

1050
0
Elected Director
Elected as New Directors D.Satyanarayana Rao, B.Veera Reddy

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్‌ 25, సింగరేణి సంస్థకు నూతన డైరెక్టర్లుగా ఇద్దరిని ఎంపికచేశారు. ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా బి.వీరారెడ్డి, ఎక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ డైరెక్టర్‌గా డి.సత్యనారాయణరావులను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయ్యారు.

సింగరేణి సంస్థలో ఇద్దరు డైరెక్టర్ల పోస్టులకు ఏర్పడిన ఖాళీలను శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూలో బి.వీరారెడ్డి, డి.సత్యనారాయణరావు అర్హులుగా నిలిచారు.

B.Veera Reddy receiving orders as Director (P&P)

ఈ ఎంపిక కమిటీలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాతో పాటు, సింగరేణి సిఅండ్‌ఎండి ఎన్‌.శ్రీధర్‌, కోలిండియా నుంచి ఎం.పి.డి.ఐ. సిఅండ్‌ఎం.డి. శేఖర్‌ సరన్‌, కేంద్రబొగ్గు శాఖ సెక్రటరీ పి.ఎస్‌.ఎల్‌. స్వామి ఉన్నారు. డైరెక్టర్‌ (పిఅండ్‌పి)గా ఎంపికైన బి.వీరారెడ్డి ఇంతకు మునుపు అడ్రియాల లాంగ్‌ వాల్‌ ప్రాజెక్టులో జనరల్‌ మేనేజర్‌గా వున్నారు. డైరెక్టర్‌ (ఇఅండ్‌ఎం)గా ఎంపికైన డి.సత్యనారాయణ రావు ప్రస్తుతం భూగర్భ గనుల జనరల్‌ మేనేజర్‌ (ఇఅండ్‌ఎం)గా పనిచేస్తున్నారు.

Orders receiving
D.Satyanarayana Rao receiving orders as Director (E&M)

డైరెక్టర్‌ (పిఅండ్‌పి) పోస్టుకు మొత్తం 5 గురు సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ హోదాలు కలిగిన వారిని ఇంటర్వ్యూకు పిలిచారు. వీరిలో బి.వీరారెడ్డి, జి.వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌.డి.ఎం.సుభానీ, కె.గురువయ్య, హాబీబ్‌ హూస్సేన్‌లు ఉన్నారు. డైరెక్టర్‌ (ఎక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌) పోస్టుకు మొత్తం నలుగురు సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ (ఇఅండ్‌ఎం) అభ్యర్ధులను ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరిలో డి.సత్యనారాయణరావు, జి.ఎస్‌.రాంచంద్రమూర్తి, ఎం.నాగేశ్వర్‌ రావు, డి.వి.ఎస్‌.సూర్యనారాయణ రాజు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here