(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 7: సింగరేణి రామగుండం ఏరియా-1 పరిధి జీడీకే 2ఎ గనికి సంబంధించిన 250 మంది కార్మికులు, ఉద్యోగులు బుధవారం టీబీజీకేఎస్ చేరారు. ఈ కార్యక్రమానికి టీబీజీకెఎస్ అధ్యక్షులు బి.వెంకట్రావ్, ఆర్‌జీ-1 టీబీజీకేఏస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వెంకట్రావ్, దామోదర్‌రావు సమక్షంలో జీడీకే.2ఎ గనిలో విధులు నిర్వహిస్తున్న 200 మంది కార్మికులు, 50 మంది మైనింగ్ అధికారులు టీబీజీకేఏస్‌లో చేరారు.
ఈ సందర్బంగా వెంకట్రావ్, దామోదర్‌రావు మాట్లాడుతూ.. టీబీజీకేఏస్ కార్మికులకు అనేక హక్కులు సాధించిపెట్టిందన్నారు. ఆ నమ్మకంతోనే ఇంత పెద్దఎత్తున కార్మికులు టీబీజీకేఏస్‌లో చేరారని పేర్కొన్నారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సమస్యను పరిష్కరించేందు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఏస్ నాయకులు జాహిద్ పాషా, నాయిని మల్లేశం, వెంకటేష్, కనకం శాంసన్, ఎట్టేం కష్ణ, పెద్దపల్లి సత్యనారాయణ, దేవా వెంకటేశం, పుట్ట రమేష్, గంగాధర్, కష్ణమూర్తి, అనిల్, కుశ్నపల్లి శంకర్, మల్లారెడ్డి, యాదవరెడ్డి, అయాజ్, పిట్ సెక్రటరీ దొనగాని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.