– అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లోకి చేరికలు
– తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని, పార్టీలోకి చేరికల పరంపరం కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుంటి చందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 13 డివిజన్ కార్పోరేటర్ రాకం లత-దామోదర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిధిగా హాజరై వేర్వేరు పార్టీలకు చెందిన 200 మందికి కండువాలు కప్పి తెరాస పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ధైర్య మని, ప్రజల గుండెల్లో గులాబీ జెండా నిండి ఉందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాలకు అకర్షితులైన కార్యకర్తలు తెరాస పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారని చెప్పారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేని విధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడుతున్నదని తెలిపారు.
పంచాయితి నుండి పార్లమెంట్ వరకు ఏ ఎన్నికయిన టిఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తు తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్న ఘనత సిఎం కేసీఆర్‌దేనని తెలిపారు. సమైఖ్య పాలనలో రైతులను పట్టించుకునే వారు లేరని, తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతను అదుకోవాలనే సంకల్పంతో సిఎం 24 గంటలు కరెంట్‌తో పాటు రైతు భీమా, రైతు బంధు, సకాలంలో ఎరువుల పంపిణి అందిస్తూ రైతన్నలకు అండగా నిలచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సింగరేణి కార్మికుల కోసం గత ప్రభుత్వాలు రద్దు చేసిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నిమయాకాల ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం చారిత్మక మైనదన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని సింగరేణి స్థలాలకు యాజమాన్య హక్కును కల్పిస్తూ పాస్ బుక్ లను త్వరలోనే అందించండం జరుగుతుందన్నారు.
రామగుండంను సమస్యలు లేని కార్పోరేషన్‌గా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు పాటుపడు తున్నామని, ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు 200 కోట్ల రూపాయలతో అభివద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు సాగంటి శంకర్, అడ్డాల స్వరూప-రామస్వామి, రాకం లత-దామోదర్, కో ఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పాత పెల్లి ఎల్లయ్య, బొడ్డు రవీందర్, నీల గణేష్, జే.వి.రాజు, మూల విజయరెడ్డి, తోడేటి శంకర్ గౌడ్, దుర్గం రాజేష్, బోమ్మగాని తిరుపతి గౌడ్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, అచ్చె వేణు, చల్లగురుగుల మెగిళి, ఆడప శ్రీనివాస్, ముడతనపల్లి సారయ్య, ఇంజపూరి నవీన్ పాల్గొన్నారు. ఇతర పార్టీల నుండి టిఆర్‌ఎస్ లో చేరిన వారిలో మాజీ కౌన్సిలర్ కుడుదుల శ్రీనివాస్, కష్ణమూర్తి, రవీందర్, మహేందర్, కొమురయ్య, శ్రీనివాస్ తదితరులున్నారు.