– నియామకపు ఉత్తర్వులను అందించిన ఆర్జీవన్ జియం
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 20: సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా 56 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించినట్లు జియం కె.నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం రోజున జియం కార్యాలయంలో నియామక ఉత్తర్వులను డిపెండెంట్లకు అంజేశారు.
ఈ సందర్బంగా జియం కె. నారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తూ వివిధ ఆనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్‌వాలిడేషన్ ఉద్యోగుల వారసులగు 56 మందికి సంస్థలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. సింగరేణి సిఅండ్‌ఏండి ఎన్.శ్రీధర్ చొరవతో త్వరిత గతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించటం జరిగిందని అన్నారు.
మెడికల్ బోర్డ్ కు దరఖాస్తు చేసున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించటం త్వరిత గతిన జరుగుతుందని తెలిపారు. అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని అన్నారు. వీరికి ఆర్.జి.1 ఏరియాలో పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు.
ఇప్పటి వరకు ఆర్జీవన్ ఏరియాలో 916 మందికి కారుణ్య నియామక ఉధ్యోగాలను అందించటం జరిగిందని. ఇందులో 25 మంది మహిళలకు అవకాశం ఇవ్వటం జరిగిందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు పొందుతున్న వీరంతా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొనుటకు విటిసిలో శిక్షణ తీసుకోవాలన్నారు. సంస్థ సీనియర్ ఉద్యోగుల వద్ద పనితనపు మెళవకులు నేర్చుకోవాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి దోహదపడి సంస్థ పురోభివృద్ధికి పాడుపడాలని సూచించారు.
ప్రస్తుతం ప్రవైట్ ఉద్యోగాలకు ఎక్కువ కాంపిటేషన్ ఉందని ఇలాంటి పరిస్థితులలో సింగరేణి ఉధ్యోగం రావటం ఒక వరం లాంటిదని అన్నారు. రోజు రోజుకి సింగరేణి సంస్థలో యువ ఉద్యోగుల స్థాయి పెరుతుందని పేర్కొన్నారు. సింగరేణి భవిష్యత్ యువ కార్మికుల చేతులలో ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఏంఓఏఐ అధ్యక్షులు పోనోగోటి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ లక్ష్మీ నారాయణ, జీఎం ఆఫీస్ ఇంచార్జ్ ప్రవీణ్, సీనియర్ పిఓ బంగారు సారంగ పాణి, సీనియర్ పిఓ శ్రావణ్ ఇతర అధికారులు అధిక సంఖ్యలో డిపెండెంట్లు పాల్గొన్నారు.